ETV Bharat / lifestyle

కాలిన గాయాలు, మొటిమల మచ్చలకు తేనెతో చెక్- బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుందట! - HONEY BENEFITS FOR SKIN AND HAIR

-తేనె రాయడం వల్ల పెదాలు పొడిబారవట! -మలబద్ధకం, ఛాతీ మంటకు తేనెతో పరిష్కారం!

honey benefits for skin and hair
honey benefits for skin and hair (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2025, 4:14 PM IST

Honey Benefits for Skin and Hair: తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే, ఆరోగ్యానికే కాకుండా.. సౌందర్య పరిరక్షణలోనూ తేనె ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాయాలు, మచ్చలను తగ్గించడంలో బాగా సహాయ పడుతుందని వివరిస్తున్నారు. కాలిన గాయాల పైన తేనెను రాయడం వల్ల మచ్చలు పడవని తెలిపారు. మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయని.. ఇంకా మొటిమల మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయంటున్నారు. 2019లో Journal of Wound Careలో ప్రచురితమైన "The Effects of Honey on Skin Wounds: A Systematic Review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ముఖ్యంగా పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీర్ణవ్యవస్థ మెరుగుపడి, పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుందని అంటున్నారు. కాఫీ, టీ, జ్యూస్, స్వీట్స్, సలాడ్స్‌లో చక్కెరకు బదులుగా తేనెను వాడొచ్చు. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. Journal of Alternative and Complementary Medicineలోని ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. The Effects of Honey on Weight Loss in Overweight and Obese Individuals: A Systematic Review and Meta-Analysis అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో Iran University of Medical Sciences ప్రొఫెసర్ Zahra Yaghoobi పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తేనె చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుందని వివరిస్తున్నారు. తేనె పూయడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

ఇంకా తేనె జుట్టుకు సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.

honey benefits for skin and hair
తేనె (Getty Images)

మీ మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారిందా? కాస్తే తేనెను పూయడం వల్ల ఈ నలుపు తగ్గి మృదువుగా మారుతుందట. ఇంకా రోజూ తేనెను తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరిగి చర్మం కాంతివంతంగా అవుతుందని తెలిపారు.

రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ముందు ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఫలితంగా ఇది మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా రాత్రిళ్లు తీసుకోవటం వల్ల రక్తపోటూ అదుపులో ఉంటుందని వివరిస్తున్నారు.

గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల తేనె, ఒక చెంచా నిమ్మరసం కలిపి పరగడుపున పిల్లలకు ఇస్తే.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. పిల్లలకు దగ్గు ఎక్కువ వస్తున్నా తమలపాకు మీద కొంచెం తేనె వేసి తినిపిస్తే, దగ్గు అదుపులోకి వస్తుందట.

ఒక గ్లాసు గోరువెచ్చటి వాటర్​లో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తీసుకుంటే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కు ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్‌ సమస్య అదుపులో ఉంటుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుడ్లు ఎలా ఉడికించాలో మీకు తెలుసా? కరెక్ట్ పద్ధతి ఇదేనని శాస్త్రవేత్తల వెల్లడి- ఇంకా లాభాలెన్నో!

టీవీ చూస్తూ అన్నం తింటున్నారా? డిన్నర్​లో ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.