Redmi Note 14 Series Global Launch: రెడ్‌మీ నోట్ 14 డిసెంబర్ 2024లో నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్‌తో పాటు ఇండియాలో లాంఛ్ అయ్యాయి. చైనాలో కూడా ఈ మూడు మొబైల్స్ సెప్టెంబర్ 2024లో రిలీజ్ అయ్యాయి. తాజాగా వీటిని గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ మూడు కొత్త ఫోన్‌లతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు రెడ్‌మీ తెలిపింది. రెడ్‌మీ వాచ్ 5 పేరుతో స్మార్ట్‌వాచ్‌ను, రెడ్‌మీ బడ్స్ 6 ప్రో పేరిట ఇయర్‌బడ్స్‌ను తీసుకురానున్నారు. ఈ రెండు ఉత్పత్తులు నవంబర్ నెలలో చైనాలో ప్రారంభించారు. ఇప్పుడు కంపెనీ ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఒకేసారి గ్లోబల్ మార్కెట్‌లో లాంఛ్ చేయనుంది.
వీటి రిలీజ్ ఎప్పుడంటే?: రెడ్‌మీ 14 సిరీస్ గ్లోబల్ రిలీజ్‌పై రెడ్‌మీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ సిరీస్‌తో పాటు ఇతర ఉత్పత్తులను జనవరి 10న ప్రారంభించనున్నట్లు తెలిపింది. వీటి లాంఛ్ ఈవెంట్లో ఈ స్మార్ట్ఫోన్లతో పాటు రెడ్‌మీ కొత్త స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్, షావోమీ 165W పవర్ బ్యాంక్ 10000 కూడా రిలీజ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ 10,000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 165W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ నోట్ 14 సిరీస్ గ్లోబల్ వెర్షన్ 200MP మెయిన్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది AI- సపోర్టెడ్ ఇమేజింగ్, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లతో వస్తుంది. ఈ సిరీస్ ఫోన్‌లు వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్‌తో IP68 రేటింగ్‌తో వస్తాయి. వీటితో పాటు ఇవి యాంటీ-డ్రాప్ ఆల్-స్టార్ ఆర్మర్ స్ట్రక్చర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ ప్రొటెక్షన్‌తో రానున్నాయి.
ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు: రెడ్‌మీ నోట్ 14 సిరీస్ గ్లోబల్ వేరియంట్స్ కూడా వాటి చైనీస్ మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. చైనాలో ప్రారంభించిన రెడ్‌మీ నోట్ 14లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. అయితే నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్‌లో వరుసగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14-బేస్ట్ హైపర్‌ఓఎస్‌తో వస్తాయి. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ఇండియన్ మార్కెట్లో వీటి ధరలు:
- రెడ్‌మీ నోట్ 14 5G ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 6GB RAM + 128GB స్టోరేజీతో వస్తుంది.
- రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజీతో వస్తుంది.
- ఇక రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G ధర రూ. 30,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది.
ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్- ఈసారి ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయో తెలుసా?
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత