Best Exercise For Weight Loss At Home :ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. బరువు తగ్గించుకోవడానికి మనకు తెలిసిన మార్గాలు అయితే ఆహారం తక్కువ తినడం లేదంటే విపరీతంగా వ్యాయామాలు చేయడం. అయితే కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను రోజుకు ఒకసారి కాకుండా రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూసేయండి.
స్ప్రింటింగ్
స్ప్రింటింగ్ అంటే తక్కువ దూరాన్ని వీలైనంత ఎక్కువ వేగంతో తక్కువ సమయంలో పరిగెత్తడం. ఇదొక ఏయిరోబిక్ ఆక్సిజన్ లెస్ వ్యాయామం. ఇది వ్యాయామం మానేసిన తర్వాత కూడా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ట్రెడ్‌మిల్‌లో లేదా బయట ఎక్కడ చేసినా స్ప్రింటింగ్ సత్వర ప్రభావాన్ని చూపిస్తుంది.
బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్
సాధారణ స్క్వాట్‌ల కంటే ఈ బార్‌బెల్ బ్యాక్ స్క్వాట్స్ శరీరంలోని అనేక కండరాలను కదిలిస్తుంది. కేలరీలు బర్న్ అయ్యే రేటును పెంచి శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. కండరాల శక్తిని పెంచుతుంది. ఇది పూర్తి శరీర వ్యాయామాన్ని అందిస్తుంది.
HIIT (హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్)
వేగంగా బరువు తగ్గాలనుకుంటే మీ వర్క్‌అవుట్ రొటీన్‌లో హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకోండి. అంటే తక్కువ సమయం పాటు భారీ వ్యాయామం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత మరో భారమైన వ్యాయామం చేయాలి. ఈ రకమైన వ్యాయామాలు సాధారణ కార్డియోల కంటే త్వరగా కొవ్వును, కేలరీలను కరిగిస్తాయి.