Besan For Weight Loss :బరువు తగ్గాలనుకునే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు కొన్ని ఆహార పదార్థాలు తింటే త్వరగా బరువు తగ్గుతారు అనే చెబితే, మరికొందరు అవే పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతారని అంటుంటారు. వీటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియక, ఏం తినాలో, ఏం తినకూడదో అర్థం కాక అయోమయం అవుతుంటారు వెయిట్ లాస్. బరువు తగ్గించడం విషయంలో ఇలా రెండు రకాల అభిప్రాయాలు కలిగిన ఆహార పదార్థాల్లో శనగపిండి ఒకటి. ఇది బరువు తగ్గిస్తుందని చాలామంది చెబుతారు. అలాగే బరువు పెంచేస్తుందని ఇంకొందరు అభిప్రాయపడతారు. దీంట్లో ఏది నిజమో మనమూ ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్, కేకులతో పాటు స్వీట్లు, డెజర్టులు వంటి రకరకాల ఆహారాల తయారీలో ఉపయోగించే శనగపిండి బరువు తగ్గాలనుకునే వారికి కచ్చితంగా ఉపయెగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే?
ప్రొటీన్లు ఎక్కువే
శనగపిండిలో ఎక్కువగా లభించే ప్రొటీన్లు కణజాలాల నిర్మాణానికి, మరమ్మతుకు చాలా అవసరం. అలాగే అధిక ప్రొటీన్ల కారణంగా శనగపిండి కడుపుకు తృప్తినిచ్చి ఆకలిని నియంత్రించడంలో, కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఫైబర్
ఫైబర్ అధికంగా కలిగి ఉండే శనగపిండి తక్కువ ఆహారం తీసుకున్నా ఎక్కువ సంతృప్తినిస్తుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. కేలరీల వినియోగాన్ని కూడా తగ్గించి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
అరుగుదల
శనగపిండిలోని ఫైబర్ ప్రేగుల కదలికలను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకు, పోషకాల శోషణకు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఇది బరువు తగ్గించేవారికి పరోక్షంగా మద్దతు ఇస్తుంది.
మజిల్ మాస్
ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బేసన్ బరువు తగ్గాలనుకునే వారికి మజిల్ మాస్కు తోడ్పడుతుంది. కండరాలు సన్నగా, మంచి ఆకృత్రికి వచ్చేలా చేస్తుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా దీర్ఘకాలం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.