Best Vegetable Juices To Reduce Belly Fat :బెల్లీ ఫ్యాట్(Belly Fat) సమస్య ఉన్నవారు వెంటనే తగ్గించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు! మీ రోజువారి డైట్లో ఈ వెజిటబుల్ జ్యూస్‌లను చేర్చుకుంటే చాలు. సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఆ హెల్తీ జూస్లేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్ :బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. క్యారెట్ ద్వారా కెరొటినాయిడ్స్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువ మోతాదులో అందుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు.
కీరదోస జ్యూస్ : అధిక వాటర్ కంటెంట్ ఉండే కీరదోసతో జ్యూస్ చేసుకుని తాగడం కూడా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడానికి తోడ్పడుతుందట. ముఖ్యంగా దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. అలాగే కీరదోసలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి టాక్సిన్లను తొలగించడానికి సహాయపడతాయి. కాబట్టి.. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు డైలీ కీరదోస జ్యూస్ తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటుందంటున్నారు నిపుణులు.
కాకరకాయ రసం : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా పనిచేసే.. కాకర రసం పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట. ముఖ్యంగా ఇందులోని ఫైబర్ పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగడంలో సహాయపడి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్‌ని కలిగించి, ఆకలిని అదుపులో ఉంచుతుందంటున్నారు.
2013 లో "Appetite" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఊబకాయంతో బాధపడేవారు రోజూ కాకరకాయ రసం తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో బీజింగ్‌లోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జాన్ వాంగ్ పాల్గొన్నారు. కాకర రసం బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.