Bad Habits to stops the Children Brain Development:తెలిసో, తెలియకో పాటించే అలవాట్లు, జీవన విధానం.. మన మెదడుపై చెడు ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా మతిమరుపు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఈ సమస్య అధికమవుతుంది. వాటిని నియంత్రిస్తే పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో చూద్దాం..
చీకటిలో ఎక్కువగా ఉండటం:చీకట్లో ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని సహజ సిర్కాడియన్ రిథమ్‌కు భంగం కలుగుతుంది. ఇది మానసిక స్థితి, జ్ఞానం, మొత్తం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి నిద్ర మేల్కొనే చక్రాలను నియంత్రించడానికి, సరైన మెదడు ఆరోగ్యాన్ని నిర్వహించడానికి వీలైంనంతవరకు లైటింగ్ ఉన్న ప్రదేశంలో ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు.
నెగిటివ్ న్యూస్‌కు రియాక్ట్ అవ్వడం:పిల్లలకు ఎప్పుడు మంచి మాటలే చెప్పాలి. ముఖ్యంగా టీవీల్లో వచ్చే నెగిటివ్ న్యూస్ పట్ల పిల్లలు ఎట్రాక్ట్ అవ్వకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. నెగిటివ్ న్యూస్ వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆందోళన, నిరాశ, బలహీనమైన అభిజ్ఞా పనితీరుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు బాధ కలిగించే వార్తలను చెప్పకపోవడం పిల్లల్లో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.
హై వాల్యూమ్‌తో హెడ్‌ఫోన్స్ యూజ్ చేయడం: చాలా మంది పిల్లలకు ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుని సాంగ్స్ వినడం లేదా సినిమాలు చూడటం ఇష్టం. అయితే ఇలా ఎక్కువ సౌండ్ పెట్టుకోవడం వల్ల చెవి లోపల సున్నితమైన నిర్మాణాలు దెబ్బతింటాయి. ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లల్లో ఆ అలవాటు మార్పించగలిగితే పిల్లల్లో వినికిడి లోపం సమస్య తగ్గడంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
అధిక స్క్రీన్ సమయం:చిన్న పిల్లలకు రోజుకు ఒక గంట కంటే ఎక్కువ స్క్రీన్ చూడకూడదని నిపుణులు అంటున్నారు. అయితే, చాలా మంది పిల్లలు రోజుకు గంటల తరబడి టీవీ, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో గడుపుతుంటారు. ఇది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అభిజ్ఞా పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి స్క్రీన్ టైమ్‌పై లిమిట్ సెట్ చేయడం, ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించడం.. ఆరోగ్యకరమైన మెదడు అలవాట్లకు, మొత్తం శ్రేయస్సుకు తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
2019లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్క్రీన్ టైమ్ కలిగిన పిల్లలు ఆందోళన, నిరాశ, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 8 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన 11 వేల మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న Dr. Jean Twenge పాల్గొన్నారు. పిల్లలు సాధ్యమైనంత తక్కువగా స్క్రీన్ చూడాలని చెప్పారు.