తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజ్​మేరీ TEA : డైలీ ఒక కప్పు తాగితే నమ్మలేని లాభాలు! - మీరూ ట్రై చేస్తారా! - Rosemary Tea Health Benefits - ROSEMARY TEA HEALTH BENEFITS

Rosemary Tea Benefits: రోజ్‌మేరీలో పోషకాలు చాలా ఎక్కువ. అందుకే చాలా మంది దీనిని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. అయితే.. కేవలం బ్యూటీ కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా రోజ్​మేరీని ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజ్​మేరీ టీ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి? ఈ టీ ఎలా ప్రిపేర్​ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Rosemary Tea Benefits
Rosemary Tea Benefits (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 3:32 PM IST

Rosemary Tea Health Benefits: రోజ్‌మేరీ.. పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో, బ్రెడ్‌-సూప్స్‌ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాగే సౌందర్య సాధనంగా కూడా దీనిని యూజ్​ చేస్తారు. దీంతో హెర్బల్‌ టీ కూడా తయారు చేస్తారు. మరి ఆ టీ ఎలా తయారు చేయాలి? దాని ప్రయోజనాలు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోషకాలు అధికం:రోజ్​మేరీలో రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కెఫెల్లిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే విటమిన్​ A, C, E, K, B6, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు చాలానే ఉంటాయి.

ప్రయోజనాలు:

ఫ్రీ రాడికల్స్​ నుంచి రక్షణ: ఈ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అయిన రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ చాలా శక్తి వంతమైనవి. ఇవి శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్​తో పోరాడతాయని.. తద్వారా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే వ్యాధి ప్రమాదాలు తగ్గిస్తాయని కూడా చెబుతున్నారు.

జీర్ణక్రియ మెరుగు:ఆహారం సరిగా జీర్ణం కావాలంటే జీర్ణ ఎంజైమ్​లు చాలా అవసరం. అయితే రోజ్​మేరీలోని పోషకాలు ఈ జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా.. ఈ టీ తీసుకుంటే అది జీర్ణక్రియకు సహాయపడుతుందని.. చాలామందిలో ఎక్కువగా కనిపించే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను క్లియర్ చేస్తుందని అంటున్నారు.

2018లో ఫైటోథెరపీ రీసెర్చ్ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. జీర్ణసమస్యలతో బాధపడుతున్న వారు రోజ్​మేరీ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్​లోని టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​లో గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ డాక్టర్​ అలీ అబ్బాస్ పాల్గొన్నారు. రోజ్​మేరీ టీ జీర్ణ సమస్యల తీవ్రతను 50% తగ్గిస్తుందని తెలిపారు.

మీకు వచ్చే రోగాల్లో 56 శాతం - కేవలం తిండి ద్వారానే! - ICMR కీలక సూచనలు! - ICMR NIN Dietary Guidelines

కండరాల నొప్పి నుంచి ఉపశమనం:రోజ్​మేరీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయని.. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆర్థరైటిస్, కండరాల నొప్పి వంటి సమస్యలున్నవారు రోజ్​మేరీ టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి దూరం:దీనిని సాధారణంగా ఎసెన్షియల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తులు, అరోమా క్యాండిల్స్​, సోప్స్​ తయారీలోనూ ఉపయోగిస్తారు. అదే విధంగా రోజ్​మేరీ టీ వాసన కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే చాలా మందిలో మూడీగా ఉండటం, ఏ పని మీదా ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలుంటాయని.. అలాంటి వారు ఈ టీ తాగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంటున్నారు.

మెరుగైన రక్తప్రసరణ:ఈ టీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని.. తద్వారా శరీరానికి ఆక్సిజన్, పోషకాలు పుష్కలంగా అందుతాయని.. శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే రోజూ ఓ కప్పు రోజ్​మేరీ టీ తాగితే రేనాడ్స్ వ్యాధి లక్షణాలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

ఆఫ్ట్రాల్ 'వెల్లుల్లి పొట్టు' అని తీసిపారేస్తున్నారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్​ పక్కా! - Garlic Peel Benefits

శ్వాసకోశ సమస్యలకు చెక్​: ఉబ్బసం, ఆస్తమా, ఆయాసం వంటి శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తున్నవారికి రోజ్​మేరీ టీ చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. రోజూ ఈ టీ తాగితే గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని.. దగ్గు, జలుబు సమయంలో ఈ టీ తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

రోజ్​మేరీ టీ తయారీ విధానం:

  • ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ రోజ్​మేరీ ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించాలి.
  • ఆకులను వడకట్టి వేడిగా లేదా చల్లగా తాగొచ్చు
  • రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

మీరు కూడా Youtube డాక్టర్​ను నమ్ముతారా? - అయితే మీకు ఇడియట్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లే! - What is IDIOT Syndrome

ABOUT THE AUTHOR

...view details