Aditi Rao Hydari Beauty Secrets :సమ్మోహనం, అంతరిక్షం, హే సినామికా వంటి చిత్రాల్లో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు హీరోయిన్ అదితీరావు హైదరీ. అయితే.. ఆమె నటన గురించి అందరికీ తెలుసుగానీ.. ఆమె బ్యూటీసీక్రెట్స్ మాత్రం దాదాపుగా ఎవరికీ తెలియదు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్లూటెన్‌కు దూరంగా!
మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. స్కిన్ గ్లోయింగ్‌గా కనిపించడానికి రోజూ పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ సిద్ధాంతాన్ని తను కూడా ఫాలో అవుతానని చెబుతున్నారు అదితీ రావ్ హైదరీ. గ్లూటెన్ ఉండే ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల చర్మం పొడి బారుతుంది. శరీరంలో వాపువస్తుంది. దీనివల్ల అందం తగ్గుతుంది. అందుకే గ్లూటెన్ ఉన్న పదార్థాలు, పాల పదార్థాలకు బదులుగా కాయగూరలు, ఆకుకూరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లు, బ్రౌన్‌రైస్, పప్పులు, డ్రైఫ్రూట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో తీసుకుంటానని ఈమె చెబుతున్నారు. అలాగే మరొక బ్యూటీ సిక్రెట్ కూడా చెప్పారు. అదేంటంటే.. డైలీ టీస్పూన్ నెయ్యి తీసుకుంటారట. ఇది చర్మం తేమగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
అమ్మ చిట్కాతో మొటిమలకు చెక్!
చాలామంది అమ్మాయిలు ముఖంపై మొటిమలొస్తే కంగారు పడుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి వివిధ రకాల క్రీమ్‌లు, లోషన్లు అప్లై చేస్తుంటారు. అయితే, ఈ హీరోయిన్ మాత్రం అమ్మ, అమ్మమ్మలు చెప్పిన చిట్కా పాటిస్తానని చెబుతోంది. గంధపు చెక్క నుంచి అరగదీసిన చందనం పేస్ట్‌ను మొటిమలపై అప్లై చేసుకుంటుందట. ఒక అరగంట తర్వాత తర్వాత శుభ్రం చేసుకుంటే.. మొటిమలు, వాటి వల్ల చర్మంపై వచ్చిన వాపు తగ్గుతాయని అంటోంది.
అందంగా కనిపించాలని రోజూ లిప్‌స్టిక్ పెట్టుకుంటున్నారా? ఈ సమస్యలు ఎటాక్ చేయడం గ్యారెంటీ! - Side Effects Of Lipstick Daily
తేమ కోసం ఈ ఆయిల్!
రోజూ ఎక్కువగా నీళ్లు తాగుతాను. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది. అలాగే రోజులో కొన్నిసార్లు నీటిలో దూదిని ముంచి దాంతో ముఖంపై అద్దడం అలవాటని ఈమె చెబుతోంది. ఇలా చేయడం వల్ల ముఖం తేమను కోల్పోకుండా చూసుకోవచ్చు. అయితే, సమ్మర్, చలికాలంతో పాటు హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారుతుంటుంది. ఈ సమయంలో ఆర్గన్ ఆయిల్‌ను ఉపయోగిస్తానని అంటోంది. కొన్ని చుక్కల ఆర్గన్ ఆయిల్‌ను ముఖంపై మర్దన చేసుకుంటానని పేర్కొంది. ఈ ఆయిల్ చర్మంలో తేమ స్థాయుల్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. అలాగే రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటానని ఈ బ్యూటీ తెలిపింది.
రోజుకు రెండుసార్లు..
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామంది ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తున్నాయి. అయితే, ఈమె ముఖంపై ఆ ఆనవాళ్లు కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటో పంచుకుంది. రోజుకు కనీసం రెండుసార్లు 'హైఅల్యురోనిక్ ఆమ్లం' ఫేస్ సీరమ్‌ను అప్లై చేసుకుంటానని చెబుతోంది అదితీ రావ్. ముఖం క్లీన్ చేసుకొని, టోనర్ రాసుకున్నాక ఈ సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకుంటుందట. ఈ ఫేస్ సీరమ్ ముడతలు, గీతలు.. వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే స్కిన్ తేమను నిలిపి ఉంచి మెరుపునిస్తుంది. ఇక్కడ మరోక విషయం గుర్తుంచుకోవాలి అది ఏంటంటే.. చర్మం తడిగా ఉన్నప్పుడు దీనిని రాసుకుంటే మరింత బాగా ఇంకుతుంది.
తేమ వాతావరణంలో.. ఇలా!
వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు స్కిన్ జిడ్డుగా మారుతుంటుంది. ఈ సమయంలో కలబంద లేదా నీళ్లు కలిపి తయారుచేసిన చందనం పేస్ట్‌తో ముఖానికి మర్దన చేసుకుంటానని ఈమె చెబుతోంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని అవి పూర్తిగా శుభ్రపడతాయి. అలాగే జిడ్డుదనం తగ్గుతుంది. ఇంకా టొమాటో ముక్కతో ముఖానికి మర్దన చేసుకోవడం, చర్మ సౌందర్యానికి పెరుగు, ఓట్‌మీల్, బియ్యప్పిండి, శెనగపిండి.. వంటి ఎన్నో చిట్కాలను ఫాలో అవుతానని అంటోంది అదితి.
రక్త హీనత నుంచి.. రక్త పోటు దాకా - ఈ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్! - Benefits Of Drumstick Water
మీ చర్మంపై తెల్ల మచ్చలకు కారణాలు ఇవే! - మీకు తెలుసా? - Causes For White Patches on Skin