ETV Bharat / health

మధ్యాహ్నం పని చేస్తుంటే నిద్ర వస్తుందా? ఆఫీస్ టైమ్​లో పడుకోవద్దంటే ఇలా చేయండి! - DAYTIME SLEEPINESS REASONS

-పని వేళల్లో నిద్రపోకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు -ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం, ఆల్కహాల్ తగ్గించాలని సలహా!

Daytime Sleepiness Reasons
Daytime Sleepiness Reasons (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Jan 6, 2025, 4:23 PM IST

Daytime Sleepiness Reasons: మనలో చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పనివేళల్లోనే నిద్ర ముంచుకు వస్తుంది. ఫలితంగా సరిగ్గా పనిచేసేందుకు శరీరం కూడా సహకరించదు. దీంతో ఏ పని మీద దృష్టి పెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అసలు పగటి పూట నిద్ర రావడానికి కారణాలేంటి? ఈ సమస్య చెక్ పెట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం: పగటి పూట నిద్ర రావడానికి రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం కూడా కారణమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తరవాత నిద్రపోవాలని.. అందుకే వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఏ ఆహారం అయినా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం: ప్రస్తుతం కాలంలో చాలామంది ఫోన్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే, రాత్రి తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకాన్ని భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సలహా ఇస్తున్నారు.

సరైన నిద్ర కూడా అవసరమే: పగటి పూట నిద్రపోకుండా ఉండేందుకు రాత్రి సమయంలో హాయిగా పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సుఖమైన నిద్ర కోసం మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలని.. గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఇంకా రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆల్కహాల్‌ వినియోగం: ఇంకా ఆల్కహాల్‌ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిద్రలేమి సమస్య ఏర్పడి శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆల్కహాల్​కు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కాఫీలు, టీలు రాత్రి వద్దు: ముఖ్యంగా కాఫీ, టీల్లొ ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాత్రి సమయంలో, భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 2018లో Nutrients జర్నల్​లో ప్రచురితమైన "The Relationship Between Diet and Daytime Sleepiness" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆరోగ్యవంతమైన నిద్ర కోసం చిట్కాలు
ఇందుకోసం రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగాలని చెబుతున్నారు. ఫలితంగా హాయిగా నిద్రపడుతుందని వివరిస్తున్నారు. ఇంకా రాత్రి పూట కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకూ నిద్రపోవాలని అంటున్నారు. దీంతో చిరాకు, అలసట, నీరసం దరి చేరవని.. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉంటారని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు ఎలా నడుస్తున్నారు? వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?

చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? వారు తాగకపోవడమే మంచిదని వైద్యుల సలహా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.