తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్‌లోకి సోషల్‌ మీడియా సెన్సేషన్‌ భామ! - Youtuber Niharika NM - YOUTUBER NIHARIKA NM

సోషల్‌ మీడియాలో సూపర్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఓ అందాల భామ సినిమాల్లోకి రాబోతోంది. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images
Youtuber Niharika NM (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 8:18 PM IST

Youtuber Niharika NM : సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి యూట్యూబర్ నిహారిక ఎన్‌ఎం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు ఫన్నీ వీడియోలతో నవ్వించి, సెలబ్రిటీ ఇంటర్వ్యూ వీడియోలతో పాపులరైన ఈ భామ త్వరలో సినిమాల్లోకి అడుగుపెట్టబోతోంది. జులై 4న ఆమె పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌లోకి వెల్‌కమ్‌ చెబుతూ గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

  • కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై మతిపోగొట్టిన నిహారిక
    సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పాపులర్‌ అయిన నిహారిక ఇటీవలే కేన్స్ 77వ చిత్రోత్సవంలో పాల్గొని వార్తల్లో నిలిచింది. భారత్ నుంచి కంటెంట్ క్రియేటర్ల జాబితాలో నిహారిక కేన్స్‌కు హాజరైంది. నేవీ బ్లూ కలర్ నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. ఆమె లుక్స్‌కు ఫిదా అయిన చాలా మంది, ఆమె కోసం నెట్టింట్లో తెగ సెర్చ్‌ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో నిహారిక లుక్స్, ఆమె ధరించిన డ్రెస్‌ హాట్ టాపిక్‌గా మారాయి.

  • సెలబ్రిటీ వీడియోలతో ఫుల్‌ పాపులర్‌
    మొదట్లో నిహారిక ఫ్యామిలీ ఇష్యూలు, ట్రాఫిక్‌ సమస్యలు, మనుషుల బిహేవియర్‌కు సంబంధించిన ఫన్నీ వీడియోలు చేసేది. మొదట ఆమెకు పెద్దగా ఫాలోవర్లు లేరు. ఎప్పుడైతే సెలబ్రిటీలతో వీడియోలు చేయడం మొదలుపెట్టిందో, అప్పటి నుంచి ఫాలోవర్స్ భారీగా పెరిగారు. కేవలం రెండు నెలల వ్యవధిలో లక్ష ఫాలోవర్స్ కాస్త, కోట్లకు చేరారు.

    మూవీ రిలీజెస్‌కు ముందు ఆయా సినిమాల హీరోలతో వీడియోలు చేస్తుంటుంది. మహేశ్ బాబు, అడివి శేష్, ఆమిర్ ఖాన్, షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ, రణ్ బీర్ కపూర్ తదితరులతో వీడియోలు చేసింది. వీటికి సోషల్‌ మీడియాలో లక్షల్లో లైకులొచ్చాయి. నటులతోనే కాదు, క్రికెటర్లు, వివిధ రంగాల్లో ప్రముఖులతోనూ నిహారిక రీల్స్, ఇంటర్వ్యూలు చేస్తోంది. విహారయాత్రలకు వెళ్తే ట్రావెల్ వ్లాగ్ చేస్తుంటుంది. క్రికెటర్ శుభమన్ గిల్‌తో చేసిన డేట్ వీడియో సూపర్‌ సక్సెస్‌ అయింది. వీడియో క్లిప్స్‌ వైరల్‌గా మారాయి.


  • టైమ్‌ పాస్‌గా మొదలై!
    ప్రస్తుతం నిహారిక యూట్యూబ్ ఛానెల్‌కు 2.82 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. నిహారిక 1997లో చెన్నైలో జన్మించింది. కానీ ఆమె కుటుంబానిది బెంగళూరు. ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజీలో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఆమె తన జర్నీపై మాట్లాడుతూ "యూట్యూబ్ ఛానల్ పెట్టింది కేవలం నా టైమ్‌ పాస్ కోసమే. నా వీడియోలు పాపులర్ అవ్వడం మొదలయ్యాకే నేను ఈ వర్క్‌ను సీరియస్​గా తీసుకున్నాను. మధ్యలో చదువుకు ఇబ్బంది అవుతుందని కొన్ని రోజులు ట్యూబ్‌కు బ్రేక్ కూడా ఇచ్చాను' అని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details