Pushpa 2 Baahubali 2 Record Break : పుష్ప 2 చిత్రం మరో రికార్డు నెలకొల్పింది. రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో, తెలుగు సినిమాల లిస్ట్‌లో ప్రథమ స్థానంలోకి వచ్చింది. దంగల్ (రూ. 2 వేల కోట్లకుపైగా) తర్వాత ఇప్పటి వరకూ రెండో ప్లేస్‌లో ఉన్న బాహుబలి 2 (రూ.1810 కోట్లు)ను రికార్డును బ్రేక్ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టినట్టు పుష్ప 2 టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
టాప్ 8 చిత్రాలివే!
అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో దంగల్, పుష్ప 2, బాహుబలి 2 తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ (రూ.1387+ కోట్లు), కేజీయఫ్ 2 (రూ.1250+ కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153+ కోట్లు), జవాన్ (రూ.1148+ కోట్లు), పఠాన్ (రూ.1050+ కోట్లు) ఉన్నాయి. వీటిలో నాలుగు తెలుగు చిత్రాలుండడం విశేషం. బాహుబలి 2 ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను 32 రోజుల్లోనే పుష్ప 2 అధిగమించడం గమనార్హం. అలా వసూలు చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.
#Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥
— Pushpa (@PushpaMovie) January 6, 2025
The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 హవా డిసెంబరు 4న ప్రీమియర్ షోతో మొదలైంది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వసూళ్ల పరంగా బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది. 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో 15 రోజుల్లోనే రూ. 632 కోట్లు (నెట్) రాబట్టింది. 31 రోజుల్లో రూ. 806 కోట్లు (నెట్) కలెక్షన్స్ చేసింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలామంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఫలానా ఓటీటీలో ఫలానా రోజున విడుదలవుతుందంటూ వార్తలొచ్చాయి. దానిపై చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ కాదని స్పష్టం చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.