తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు! - Yash Street Shop

Yash Street Shop : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ చేసిన ఓ పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు!
బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు!

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 2:28 PM IST

Yash Street Shop : భార్యను సంతోష పెట్టాలంటే వేలు, లక్షల రూపాయలు ఖరీదు చేసే బహుమతులే ఇవ్వాల్సిన పనిలేదు. వారు కోరుకునే చిన్న చిన్న సంతోషాలను నెరవేర్చితే చాలు. ఆమెతో కలిసి సరదాగా కాసేపు కబుర్లు చెబుతూ గడిపితే చాలు తెగ సంబరపడిపోతారు. మన మీద తల్లితో సమానంగా ప్రేమను పంచేస్తారు. ఇప్పుడు అలాంటి పనే చేసే కన్నడ రాకింగ్ స్టార్​ యశ్‌ - . తన భార్య చేత ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఆమె ఐస్‌క్యాండీ అడిగిందని చిన్న కిరాణా దుకాణానికి తీసుకెళ్లి మరీ దాన్ని కొనిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతున్నాయి.

యశ్‌ రీసెంట్​గా ఫ్యామిలీతో కలిసి ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌లోని షిరాలీని సందర్శించడానికి వెళ్లారు. అక్కడే చిత్రపుర మఠాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే అక్కడ తన భార్య ఐస్‌ క్యాండీ అడగడంతో దగ్గర్లోనే ఉన్న చిన్న షాపుకు వెళ్లిఐస్‌ క్యాండీతో పాటు, కొన్ని చాక్లెట్లు కూడా కొని తన భార్యను సంతోషపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​ షేర్ చేస్తున్నారు. దీంతో అవి బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కు వెళ్లి కొనగలిగే స్థోమత ఉన్నా, ఖరీదైన బహుమతులు కొనగలిగే ఐశ్వర్యం ఉన్నా, విలాసవంతమైన సౌకర్యాలను అనుభవించే అవకాశం ఉన్నా, యశ్‌ ఆయన భార్య ఎంతో సింపుల్‌గా ఉన్నారు అంటూ ఆయన అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Yash The Toxic Movie : కాగా, టీవీ యాక్టర్​గా సినీ జర్నీని మొదలు పెట్టిన యశ్​ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్‌ ఇండియా హీరోగా మారారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటించిన కేజీయఫ్‌ సిరీస్ చిత్రాలు ఆయన్ను బాక్సాఫీస్‌ కింగ్​గా నిలబెట్టాయి. రూ.వందల కోట్ల వసూళ్లను తెచ్చిపెట్టాయి. దీంతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం యశ్‌ టాక్సిక్‌(The Toxic Movie) అనే సినిమా చేస్తున్నారు. మలయాళ దర్శకురాలు నేషనల్ అవార్డ్ విన్నర్​ గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమనను తెరకెక్కిస్తున్నారు.

సందీప్ కెరీర్​లో హయ్యెస్ట్​ గ్రాసర్ - 'భైరవకోన' తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే ?

బాలీవుడ్ హీరోయిన్​కు బాలయ్య టీమ్​ స్పెషల్​ సర్​ప్రైజ్!

ABOUT THE AUTHOR

...view details