Vicky Kaushal Chhaava Openings : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నటి రష్మిక లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఛావా' తాజాగా ఓ అరుదైన రికార్డును సృష్టించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.31 కోట్లు వసూళ్లు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా చరిత్రకెక్కింది.
ప్రీ సేల్ బుకింగ్స్ అదుర్స్!
ఇదిలా ఉండగా, ఈ సినిమాప్రీ సేల్ బుకింగ్స్‌లో అదరొగట్టింది. ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ టీమ్ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఇంతటి ఆదరణ వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. వీకెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని స్క్రీన్‌ల సంఖ్యనుస కూడా పెంచుతున్నట్లు ఈ మేరకు తెలిపింది.
ప్రశంసల వెల్లువ
ఇక ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించి మెప్పించారని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో ఎమోషనలయ్యామంటూ చెప్పుకొచ్చారు.