ETV Bharat / entertainment

NTR​పై డబుల్ ప్రెజర్! సినిమాల షూటింగ్ ఆలస్యం!- ఆ మూవీస్​ టైమ్​కు వచ్చేనా? - JR NTR WAR 2 SHOOTING

జూనియర్ ఎన్​టీఆర్​ అప్​కమింగ్ మూవీల షూటింగ్ ఆలస్యం! - టైమ్​కు రిలీజ్ అయ్యేనా?

JR NTR UPCOMING MOVIES
JR NTR UPCOMING MOVIES (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2025, 2:22 PM IST

Updated : Feb 19, 2025, 3:08 PM IST

JR NTR Upcoming Movies : గతేడాది 'దేవర'తో బ్లాక్​బస్టర్ హిట్​ సాధించారు జూనియర్ ఎన్​టీఆర్​. ఆ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ఆయన, ఆ తర్వాత రెండు పెద్ద సినిమాల షూటింగ్​లకు డేట్స్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న 'NTR 31' కాగా, మరొకటి బాలీవుడ్ మూవీ 'వార్-2'. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో ఎన్​టీఆర్​పై డబుల్ ప్రెజర్ పడుతున్నట్లు తెలుస్తోంది.

వార్-2లో సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్!
'దేవర' తర్వాత 'వార్- 2' షూటింగ్ కోసం ఎక్కువ డేట్స్ కేటాయించారు. అయితే ఇంకా ఈ మూవీ షూటింగ్ పూర్తి కానట్లు తెలుస్తోంది. 'వార్-2'ను ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్​ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోంది. అయితే ఈ బ్యానర్ నుంచి పలు సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలకే దాదాపుగా రిలీజ్ అవుతాయి.

అయితే 'వార్- 2'లో ఎన్​టీఆర్​, హృతిక్ కాంబోలో ఓ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. విడుదలకు ఇంకా 5నెలల సమయం ఉండటం వల్ల 'వార్-2' అనుకున్న టైమ్​కు రిలీజ్ అవుతుందా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

సంక్రాంతికి రిలీజ్ కు ప్లాన్
ఎన్​టీఆర్​, డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్‌ కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఎన్​టీఆర్ ఆర్ట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా అప్పటికి పూర్తవుతుందా? లేదా? అనే అనుమానం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.

'వార్- 2' షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడం వల్ల ఎన్​టీఆర్ తన లుక్​ను ఇంకా మార్చుకోలేదు. 'వార్- 2' లుక్​లోనే ఉన్నారు. దీంతో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 'వార్- 2' సినిమాను పూర్తి చేసిన తర్వాత #NTR 31 సెట్స్​కు తారక్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్​లో షూటింగ్ ప్రారంభం
ఎన్​టీఆర్​ -ప్రశాంత్‌ నీల్‌ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తొలి షెడ్యూల్‌ లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారట. మార్చి నుంచి ఎన్​టీఆర్​ సెట్స్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేశారట. అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కోసం తారక్- VD 12 క్రేజీ అప్డేట్!

చిన్నారుల 'దావూదీ' డ్యాన్స్​కు తారక్​ ఫిదా- సో అడోరబుల్ అంటూ కామెంట్!

Last Updated : Feb 19, 2025, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.