Vijay Antony Toofan Movie : అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. బ్యాక్ గ్రౌండ్ లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి వైవిధ్యమైన కథలతో హీరోగా ఎదిగారు. రీసెంట్గా లవ్ గురు చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన మరికొద్ది రోజుల్లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ తుఫాను సినిమాతో ఆడియెన్స్‌ను అలరించనున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు విజయ్. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను ఎందుకు చెప్పులు లేకుండానే తిరుగుతున్నారో, అసలు ఎందుకు చెప్పులు వేసుకోవడం మానేశారో గల కారణాన్ని వివరించారు.
"నేను మూడు నెలల నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నాను. అందరూ నేను ఏదో దీక్ష చేస్తున్నానని భావిస్తున్నారు. అలాంటిదేం కాదు. ఓసారి చెప్పులు లేకుండా నడిచా. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే. మనపై మనకు నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అయినా చెప్పులు లేకుండా తిరుగుతుంటే నేనేమీ ఒత్తిడికి గురికాలేదు. అందుకే ఇక లైఫ్ లాంగ్ చెప్పులు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను" అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. కాగా, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా చెప్పులు వేసుకోరన్న సంగతి తెలిసిందే. తనకు చెప్పులు వేసుకొని నడవడం ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.