ETV Bharat / sports

క్రికెట్‌లో ఎన్ని రకాల కెమెరాలు ఉపయోగిస్తారు? వాటి ధర ఎంతంటే? - CRICKET CAMERA AND PRICE

అంపైర్‌ నిర్ణయాల్లో కెమెరాలే కీలకం- వీటి ఫీచర్లు చూస్తే షాక్‌ అవుతారు?

Types Of Cameras Used In Cricket
Types Of Cameras Used In Cricket (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 13, 2025, 6:59 PM IST

Types Of Cameras Used In Cricket : మన దేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లేయర్‌ల ఫీజులే కాదు మ్యాచ్‌ నిర్వహణకు కూడా భారీగా ఖర్చు చేస్తారు. లైవ్‌ యాక్షన్‌ని ఎలాంటి అంతరాయాలు లేకుండా అభిమానులకు అందించేందుకు చాలా అడ్వాన్స్‌డ్‌ డివైజ్‌లు వినియోగిస్తారు. ఇందులో కెమెరాల పాత్ర కీలకం. మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయడంలోనే కాదు థర్డ్‌ అంపైర్‌లు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కెమెరా విజువల్స్‌పైనే ఆధారపడతారు.

బౌలర్‌, బ్యాటర్‌, కీపర్‌, అన్ని పొజిషన్‌లలోని ఫీల్డర్లు, అంపైర్‌లు, ప్రేక్షకులు, కామెంటేటర్‌లు ఇలా అన్ని యాంగిల్స్‌ని కెమెరాలు కవర్‌ చేస్తుంటాయి. క్రికెట్ మ్యాచ్‌లో అన్ని యాంగిల్స్‌ని, ప్రతి మూమెంట్‌ని క్యాప్చర్ చేయడానికి 30 కంటే ఎక్కువ కెమెరాలు అవసరం. వీటిలో ఎన్ని రకాల కెమెరాలు ఉంటాయి? ధర ఎంత? ఇప్పుడు చూద్దాం.

స్పైడర్‌ క్యామ్

క్రికెట్‌లో ఉపయోగించే అడ్వాన్స్‌డ్‌ కెమెరాల్లో స్పైడర్‌క్యామ్ ఒకటి. ఇది కేబుల్స్ సాయంతో ఫీల్డ్‌లో కదులుతుంది. ప్రతి మూమెంట్‌ని వివిధ కోణాల నుంచి క్యాప్చర్‌ చేస్తుంది. ఈ కెమెరా హై జూమ్ కెపాసిటీ కలిగి ఉంటుంది, చాలా దూరం నుంచి కూడా క్లియర్‌ ఫుటేజీని అందిస్తుంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఆధారంగా దీని ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది.

Spider Camera
స్పైడర్ కెమెరా (Getty Images)

హెల్మెట్ కెమెరా
హెల్మెట్ కెమెరాలను ప్లేయర్‌లు అంపైర్లు ధరిస్తారు. ఈ కెమెరాలు ఫస్ట్‌-పర్సన్‌ వ్యూని అందిస్తాయి. అభిమానులు మ్యాచ్‌ని బ్యాటర్ లేదా అంపైర్ దృష్టికోణం నుంచి చూడటానికి వీలు కల్పిస్తాయి.

బౌండరీ కెమెరాలు
వీటిని బౌండరీ లైన్‌ వద్ద ఉంచుతారు. క్యాచ్‌లు పట్టే సమయంలో, బౌండరీని ఆపేటప్పుడు ఫీల్డర్‌ కదలికలను క్యాప్చర్‌ చేస్తాయి. ఒక మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది బౌండరీ కెమెరాలు ఉపయోగిస్తారు.

స్టాండర్డ్‌ బ్రాడ్‌కాస్ట్‌ కెమెరా
ఈ కెమెరాని లైవ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కోసం ఉపయోగిస్తారు. మ్యాచ్‌ని హై-క్వాలిటీ విజువల్స్‌తో ప్రసారం చేస్తుంది. ఈ కెమెరా ఖరీదు రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుంది.

Standard Broadcast Camera
స్టాండర్డ్ బార్డకాస్ట్​ కెమెరా (Getty Images)

పిచ్ సైడ్ కెమెరా
ఈ కెమెరా వివిధ కోణాల నుంచి మ్యాచ్‌ను క్యాప్చర్ చేస్తుంది. ఇది రిమోట్-కంట్రోల్డ్‌ కెమెరా. మ్యాచ్‌ని ప్రత్యేక కోణంలో చూపుతుంది. ధర రూ.10 నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది.

హై-స్పీడ్ కెమెరాలు
ఇవి స్లో-మోషన్ రీప్లేలలో సహాయపడతాయి. క్లోజ్ రన్-అవుట్‌లు, క్యాచ్‌లు, ఇతర కీలక మూమెంట్‌లని పరిశీలించేందుకు ఉపయోగపడతాయి. ఈ కెమెరాల ధర దాదాపు రూ.1 నుంచి రూ.2 కోట్లు.

అల్ట్రా హై డెఫినిషన్ (UHD) కెమెరా
ఈ 4K కెమెరా మ్యాచ్‌ను అల్ట్రా-హై-డెఫినిషన్ క్వాలిటీలో క్యాప్చర్ చేస్తుంది. ప్లేయర్‌ల క్లోజ్-అప్ షాట్‌లు, కీలక మూమెంట్‌లను చాలా క్లియర్‌గా అందిస్తుంది.

స్టంప్ కెమెరా
ఇవి స్టంప్స్ లోపల ఉంటాయి. 1990 నుంచి 2000 వీటిని ఇంట్రడ్యూస్‌ చేశారు. ఇవి బంతిని ట్రాక్ చేస్తాయి, సౌండ్‌ని రికార్డు చేస్తాయి. ఈ కెమెరాలు బౌల్డ్ అయినప్పుడు, ఇతర స్టంప్-రిలేటెడ్‌ మూమెంట్‌లని ప్రత్యేక యాంగిల్‌లో చూపుతాయి.

Stump Camera
స్టంప్ కెమెరా (Getty Images)

హెలి క్యామ్/డ్రోన్ కెమెరా
డ్రోన్‌లు, హెలీ కెమెరాలు స్టేడియంలోని ఏరియల్‌ ఫుటేజీని క్యాప్చర్‌ చేస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అంపైర్లకు సహాయం చేస్తాయి. ముఖ్యంగా DRS (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) వంటి సందర్భాల్లో కీలకం అవుతాయి. ఈ కెమెరాల ధర రూ.5 నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది.

Types Of Cameras Used In Cricket
డ్రోన్​ కెమెరా (Getty Images)

రిఫరీ, థర్డ్ అంపైర్ కెమెరా
ఈ కెమెరాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో రిఫరీకి థర్డ్ అంపైర్‌కి సహకరిస్తాయి. రీప్లే చేసి చూసేందుకు చాలా యాంగిల్స్‌లో ఫుటేజీ అందిస్తాయి. కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడతాయి.

అయ్యో వికెట్​ కీపర్ ఎంత పని చేశావయ్యా! - ఒక్క మిస్టేక్​తో కప్​ దూరమైందిగా!

ఎయిర్​పోర్ట్​లో 'లక్కీ లేడీ'! - విరాట్​ వెళ్లి మరీ ఆమెకు హగ్​ ఇచ్చాడుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.