Prabhas Hanu Raghavapudi Movie : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపుడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇమాన్వీ అనే యంగ్ బ్యూటీ నటిస్తుండగా, తాజాగా ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఇందులో భాగమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ప్రభాస్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో ప్రభాస్ లుక్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
"ఇండియన్ చిత్ర పరిశ్రమకు బాహుబలిగా పేరుపొందిన ప్రభాస్‌తో కలిసి నేను నా 544వ ప్రాజెక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై టాలెంటెడ్ హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అద్భుతమైన కథ జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్" అంటూ అనుపమ్ నెట్టింట రాసుకొచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే, భారీ బడ్జెట్‌తో నిర్మితం అవుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విభిన్నమైన కథతో ఇది తెరకెక్కుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే పాటలు కూడా కంపోజ్ చేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసేశారట. అందులో మెయిన్ లీడ్‌పై తీసిన సీన్స్ అద్భుతంగా వచ్చాయట. ప్రస్తుతానికైతే ప్లానింగ్ ప్రకారం షూట్ నిర్విరామంగా జరిగిపోతున్నట్టుగా సమచారం.
Prabhas Upcoming Movies : కాగా, 'సలార్', 'కల్కి 2898 AD' సినిమాల సక్సెస్‌తో జోష్ మీదున్న రెబల్ స్టార్ ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. త్వరలోనే 'రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్, 'సలార్ 2' వంటి సినిమాల్లోనూ నటిస్తున్నారు. వీటితో పాటు మరో మూడు చిత్రాలు కూడా ఆయన లైనప్‌లో ఉండటం విశేషం.
'ప్రభాస్‌కు అప్పుడు చాలా భయం ఉండేది - మేం అలా చేసేవాళ్లం'
డార్లింగ్‌కు జోడీగా ఇమాన్వీ- ఈ ముద్దుగుమ్మ ఎవరంటే? - Prabhas Hanu Heroine