Reliance World Cup 1987 : భారత్ ఆతిథ్యం ఇచ్చిన తొలి వరల్డ్ కప్ 1987లో జరిగింది. అయితే అంతకముందు వరుసగా మూడు ప్రపంచకప్‌లు ఇంగ్లాండ్ వేదికగా జరిగాయి. ఆ తర్వాత జరిగిన నాలుగో వరల్డ్‌కప్‌ను ఆసియా ఖండంలో భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించాయి. అయితే ఈ ప్రపంచకప్‌ను 'రిలయన్స్ వరల్డ్ కప్' అని కూడా పిలుస్తారు. అసలేందుకు ఆ వరల్డ్ కప్‌కి అలాంటి పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం.
ఆత్మగౌరవం దెబ్బతిని
ఋ1983 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఫైనల్‌కు చేరింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు బీసీసీఐ అధికారులకు కొందరికి ఎక్స్ట్రా పాస్‌లు కావాలంటూ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ హరీశ్ సాల్వే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరారు. అయితే సాల్వే అభ్యర్థనను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు అవమానానికి గురైనంత పని జరిగింది. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని సాల్వే గ్రహించారు. దీంతో ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు.
పీసీబీతో చర్చించి
ఈ విషయంపై సాల్వే తన ఆలోచనలను అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఛైర్మన్ నూర్ ఖాన్‌తో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్, ఇండియాలో 1987లో జరిగే ప్రపంచకప్‌ను నిర్వహించాలని ఆలోచించారు. అయితే వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్‌ను నిర్వహించాలంటే ఆర్థిక బలం అవసరం. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీలైన జగ్మోహన్ దాల్మియా, ఐఎస్ బింద్రా వంటివారితో కలిసి సాల్వే వ్యూహాలు రచించారు.
ఈ ప్రపంచకప్‌ను ఆసియా ఖండంలో నిర్వహించేందుకుగాను అసోసియేట్ దేశాలకు భారీ మొత్తాన్ని బీసీసీఐ, పీసీబీ ఆఫర్ చేశాయి. అప్పుడు వరల్డ్‌కప్ నిర్వహణపై ఓటింగ్ జరగ్గా 16 ఓట్లలో భారత్, పాక్‌కు 12 వచ్చాయి. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ను నిర్వహించే అవకాశాన్ని ఈ రెండు దేశాలు దక్కించుకున్నాయి. అంతా బాగానే ఉన్నా టోర్నీ నిర్వహణకు రూ.32కోట్లు నిధులు అవసరం అని అంచనా వేశారు. అయితే చాలా మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున ఆ ఖర్చులో మూడింట రెండు వంతులు మన దేశం భరించాల్సి వచ్చింది. స్పాన్సర్‌షిప్‌లు, టీవీ హక్కుల ద్వారా ఆదాయాన్ని సంపాదించాలనేది బీసీసీఐ ప్రణాళిక. అయితే ఆ ఆదాయం టోర్నీ నిర్వహణ తర్వాత వస్తుంది.
1990 :: Former BCCI President N.K.P. Salve In an Interview With Sportsworld Tells @AmritMathur1 The Reason Why India Decided to Bid for 1987 Cricket World Cup pic.twitter.com/YxEfDv3EIJ
— indianhistorypics (@IndiaHistorypic) November 5, 2023
ఇందిరాతో చర్చలు
ఈ క్రమంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని బీసీసీఐ అధ్యక్షుడు హరీశ్ సాల్వే కలిశారు. ప్రపంచకప్ నిర్వహణ గురించి ఆమెతో చర్చించారు. ఈ క్రమంలో టోర్నీ నిర్వహణకు నిధులు సమకూర్చడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీతో ఇందిరాగాంధీ చర్చించారు. నిధులు ఇచ్చేందుకు ధీరూభాయ్ కూడా అంగీకరించారుు. అంతా బాగుంది అనుకునేలోపే విషాదం నెలకొంది. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ప్రధాని పీఠాన్ని రాజీవ్ గాంధీ స్వీకరించారు.
మళ్లీ బీసీసీఐ కథ మొదటికే వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం అంబానీతో అంత స్నేహపూర్వకంగా లేదు. దీంతో ప్రపంచకప్ నిర్వహణ కోసం బీసీసీఐకి రిలయన్స్ గ్రూప్ నుంచి నిధులు మంజూరు అవ్వలేదు. కోకా కోలా, జిల్లెట్, మిత్సుబిషి వంటి అంతర్జాతీయ స్పాన్సర్లను సంప్రదించినా బీసీసీఐకి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ అర్థం చేసుకుని ధీరూభాయ్ అంబానీతో చర్చలు జరిపేందుకు బీసీసీఐకి అనుమతి ఇచ్చారు. అయితే ఈ చర్చల సందర్భంగా బీసీసీఐ ఎదుట ధీరూభాయ్ అంబానీ రెండు షరతులు పెట్టారు.
Australia Champion of 4th Reliance World Cup 1987 defeated England #ONTHISDAY 08-11-1987 @ Eden Gardens Calcutta India.pic.twitter.com/SAuwoukSMo
— Zohaib (Cricket King)🇵🇰🏏 (@Zohaib1981) November 8, 2023
'వరల్డ్ కప్‌నకు ముందు భారత్, పాక్ జట్ల మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. టీవీలో ఆ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే ఆ మ్యాచ్ జరిగే సమయంలో ప్రధాని పక్కనే నాకు ఓ సీటు ఇవ్వాలి. అలాగే ఈ ప్రపంచకప్‌నకు రిలయన్స్ కప్‌గా పేరు మార్చాలి.' అని బీసీసీఐకి ధీరూభాయ్ షరతులు విధించారు. అయితే వాటికి బీసీసీఐ ఓకే చెప్పింది. దీంతో వరల్డ్‌కప్ నిర్వహణకు రూ.9కోట్లు ఇచ్చింది రిలయెన్స్ సంస్థ. కాగా, ఈ టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌కు బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ - వెరీ కాస్ట్లీ గురూ!
'బ్యాడ్‌లక్ అంటే నీదే బ్రో'- క్రికెట్లో ఇలా కూడా రనౌట్ అవుతారా?