తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నెం.59పై రామ్​ చరణ్ ఫ్యాన్స్​ అసహనం! - ఎందుకంటే? - Ram Charan Game Changer - RAM CHARAN GAME CHANGER

Ram Charan Game Changer: మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ఫ్యాన్స్​ నెం.59పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారట! అదేంటి ఆ నెంబర్​తో సంబంధం ఏంటని అనుకుంటున్నారా? దాని గురించే ఈ కథనం.

Ram Charan Game Changer
Ram Charan Game Changer (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 3:24 PM IST

Ram Charan Game Changer:అదేంటి ఆ నెంబర్​పై మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ ఫ్యాన్స్​ అసంతృప్తి వ్యక్తం చేయడం ఏంటని అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉంది. అదేంటంటే తాజాగా విజయ్​ దేవరకొండ- రవికిరణ్ కోలా కాంబోలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమాను అనౌన్స్ చేయడమే కారణం. ఈ చిత్రాన్ని తమ ఎస్​వీసీ (SVC) బ్యానర్​లో 59వ సినిమాగా ప్రకటించారు.

అయితే మూడేళ్ళకు ముందు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను తమ బ్యానర్​లో 50వ చిత్రంగా గర్వంగా ప్రకటించింది ఎస్​వీసీ. తీరా ఏళ్లు గడిచిపోతున్నా ఆ సినిమా విడుదల కాదు కదా, ఒక్క సరైనా అప్డేట్ కూడా రావట్లేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ అప్పటి నుంచి బాగా నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తీవ్ర అసహనానికి కూడా గురౌతున్నారు.

పైగా గేమ్ ఛేంజర్ ప్రకటించిన తర్వాత మరో తొమ్మిది సినిమాల వరకు దిల్​ రాజు అనౌన్స్ చేసేశారు. కానీ పాన్​ ఇండియా మూవీ 'గేమ్​ఛేంజర్'​ మాత్రం ఆలస్యం చేస్తూనే వస్తున్నారని అభిమానులు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ 59వ నెంబర్​పై ఫ్యాన్స్​ కాస్త గుస్సా అయ్యారట.

వాస్తవానికి దిల్ రాజు చేతుల్లో ఏం లేదన్నది ఓపెన్ సీక్రెట్ అనే చెప్పాలి. దర్శకుడు శంకర్ చేతుల్లోనే ఈ సినిమా భవిష్యత్​ ఉంది. ఆయనే ఏదీ తేల్చడం లేదు. ఓ వైపు దీని షూటింగ్ చేస్తూనే మరోవైపు 'భారతీయుడు 2'కు సంబంధించి షూటింగ్, రిలీజ్ పనులు చూసుకుంటూ వస్తున్నారు. దీని వల్ల ఆలస్యం అవుతోంది. ముందుగా జూన్ రిలీజ్ అనుకున్న 'ఇండియన్ 2' ఇప్పుడు జులై, ఆగస్టు అని అంటున్నారు. అప్పుడు కూడా వస్తుందన్న గ్యారెంటీ కనపడట్లేదు.

ఇక అక్టోబర్ లేదా సెప్టెంబర్​లో గేమ్​ ఛేంజర్ వస్తుందని నమ్మకం పెట్టుకున్న రామ్​ చరణ్ ఫ్యాన్స్​కు మెల్లగా ఆ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. అనంతరం వచ్చే ఏడాది జనవరి రిలీజ్​ అనుకుంటున్నా అది కుదిరేలా లేదు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి 'విశ్వంభర' ఇప్పటికే లాక్ అయ్యింది. అంటే ఈ లెక్కన 'గేమ్ ఛేంజర్' మళ్ళీ వచ్చే ఏడాది జనవరి తర్వాతే అని టాక్ నడుస్తోంది. కానీ అప్పటివరకు తీసుకెళ్లకూడదనే దిల్ రాజు అనుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.

'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ - చెన్నైలో క్రేజీ ఎపిసోడ్స్ - Ram Charan Game Changer

స్టేజీపై నుంచి ఉపాసనకు చరణ్ సైగలు- ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? - Ram Charan Upasana Cute Video

ABOUT THE AUTHOR

...view details