Goshamahal MLA Raja Singh Suggests Ayyappa Devotees Not To Visit Vavar Masjid : శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీద్‌కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. అయ్యప్పలు నిష్టగా మాల వేసి, 41 రోజులు దీక్ష చేసి మసీద్‌లోకి వెళ్తే అపచారమని అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మసీద్‌కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని, అది కుట్రలో భాగమని తెలిపారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి (బాస్) ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం కోసం కావలసిన సామగ్రిని తరలించే లారీని రాజా సింగ్ హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకొని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పించాలని, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చొరవ చూపాలని రాజా సింగ్ కోరారు.
అయ్యప్ప భక్తులకు అలర్ట్ - ఫారెస్ట్ రూట్ స్పెషల్ పాస్‌లు తాత్కాలికంగా బంద్!
శబరిమల భక్తుల కోసం 'స్వామి' AI చాట్‌బాట్- ఇకపై ఏ విషయంలోనూ నో ప్రాబ్లమ్!