ETV Bharat / entertainment

బీటౌన్​లో చెర్రీ భారీ ప్లానింగ్​!- ఆ స్టార్ డైరెక్టర్ డ్రీమ్​ ప్రాజెక్ట్​లో ఎంట్రీ - RAM CHARAN BOLLYWOOD MOVIE

బాలీవుడ్ డైరెక్టర్​తో సుదీర్ఘ చర్చలు - అన్నీ ఓకే అయితే మైథలాజికల్‌ మూవీలో చెర్రీ

Ram Charan Bollywood Movie
Ram Charan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2025, 6:46 AM IST

Ram Charan Bollywood Movie : గ్లోబల్​ స్టార్ రామ్​ చరణ్‌ ప్రస్తుతం 'RC 16' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రీసెంట్​గా ఆయన ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ యాడ్ షూట్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ రూమర్​ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?

మైథలాజికల్‌ మూవీలో చెర్రీ
2024లో 'కిల్' అనే హై వోల్టేజ్‌ యాక్షన్ మూవీతో డైరెక్టర్ నిఖిల్ నగేశ్​ భట్ హిట్‌ అందుకున్నారు. ఈ సినిమాకి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే దీని కోసం ఆయన చెర్రీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తనతో ఓ భారీ పౌరాణిక ఇతిహాసం తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారట.

గత ఆరు నెలలుగా రామ్ చరణ్, నిఖిల్ ఈ భారీ బడ్జెట్ పౌరాణిక సినిమా గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ భారతీయ పురాణాలలో అత్యంత కీలకమైన పాత్రల ఆధారంగా తెరకెక్కుతుందని తెలిసింది. ప్రీ-విజువలైజేషన్ ఇప్పటికే పూర్తి కావడం వల్ల ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో చరణ్‌తో కలిసి పనిచేయడానికి ప్రొడక్షన్ టీమ్ ఉత్సాహంగా ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మేకర్స్.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ఎవ్వరి ఊహకి అందని స్థాయిలో ఉంటుందని, ప్రస్తుతం ప్రాజెక్టు కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై రామ్ చరణ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ పౌరాణిక సినిమాకి ముందు డైరెక్టర్‌ నిఖిల్, నిర్మాత మురాద్ ఖేతానితో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యారట. వీరిద్దరూ గతంలో 2023 థ్రిల్లర్ 'అప్రువా'లో కలిసి పనిచేశారు. వారి కొత్త వెంచర్ డీటైల్స్‌ కూడా ఇంకా వెల్లడించలేదు.

అయితే నిఖిల్ సినిమాతో పాటు, చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్‌ సహా పలువురు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, చెర్రీ లైనప్​లో నిఖిల్ నగేశ్​ భట్, సుకుమార్‌ సినిమాలు యాడ్ అవ్వచ్చని అంటున్నారు.

RC 16 అప్డేట్- ఆ సీన్స్​లో నేచురాలిటీ​ కోసం అలా షూట్ చేస్తున్నారట!

RC 16 బ్యాక్​డ్రాప్​ తెలిసిపోయిందోచ్చ్! - సినిమాటోగ్రాఫర్‌ అలా హింట్ ఇచ్చేశారుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.