Son Leaving Old Father On Road In Hyderabad : కని అల్లారుముద్దుగా పెంచిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులను వారి ముసలితనంలో బిడ్డలు దూరం పెడుతున్నారు. ఆస్తులు లేని వారి విషయంలోనే కాదు ముందుగానే ఆస్తులను పిల్లలకు పంచేసిన కొందరిపట్ల అలాగే ప్రవర్తిస్తున్నారు.
దయనీయ స్థితిలో వృద్ధుడు : మరికొందరైతే పాడైన పదార్థాలను, వస్తువులను విసిరేసినట్లు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను రోడ్లు, బస్టాండ్లు, ఆసుపత్రుల చెంత నిర్దయగా వదిలేసి వెళ్తున్నారు. దీంతో సరిపడా తిండిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక అనారోగ్య సమస్యలతో వృద్ధులు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు కన్న కుమారులే రోడ్డుపై వదిలేశారనే బాధ, మరోవైపు చలికి గజగజ వణుకుతూ ఎక్కడ బతికాలో తెలీక దయనీయ స్థితిలో ఉన్నారు. రేపు వాళ్లకి ఇలాగే జరగొచ్చు అనే విషయాన్ని మరుస్తున్నారు.
కారులో తీసుకొచ్చి విడిచి పెట్టిన కుమారులు : తాజాగా అనారోగ్యం బారిన పడిన 65 ఏళ్ల వృద్ధుడిని అమానవీయంగా కుటుంబ సభ్యులే బస్‌స్టాప్‌లో వదిలేసిన హృదయ విదారక ఘటన సికింద్రాబాద్‌లోని బొల్లారంలో చోటుచేసుకుంది. తన పేరు గోవర్ధన్‌రెడ్డిగా మాత్రం పేర్కొన్నాడు. ఎవరో ఆసుపత్రి సిబ్బంది గురువారం రాత్రి వదిలేసి వెళ్లినట్లు తెలిపాడు.
చలిలో వనుకుతూ రోడ్డుపైనే : స్థానికులు మాత్రం కుటుంబ సభ్యులే కారులో వచ్చి వదిలేసి వెళ్లారని చెబుతున్నారు. పడుకోవడానికి దుప్పట్లు దోమల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసి వృద్ధుడిని వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం కొందరు స్థానికులు తినడానికి భోజనం ఏర్పాట్లు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చలిలో గజగజ వణుకుతూ రోడ్డుపైనే పడుకొని ఉన్నాడు. ఆ వృద్ధుడిని చూసిన స్థానికులకు కళ్లలో నీళ్లు తిరుగున్నాయి. వృద్ధుని కోసం కుటుంబ సభ్యులు ఎవరు ఆయనను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో పోలీసులే వృద్ధాశ్రమానికి తరలించారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి
70 ఏళ్ల ఏజ్‌లో 88 అడుగుల సొరంగం తవ్విన పెద్దాయన- ఎందుకో తెలుసా? - Man Built Tunnel