తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్ బరిలో మెగాహీరో అదిరే ఆట - రానున్న స్పోర్ట్స్ డ్రామాలు ఇవే! - Tollywood Sports Drama Movies

Tollywood Sports Drama Movies : ఆటల్ని మైదానంలోనే కాదు రెండున్నర గంటల సినిమాలానూ తెరపై చూడటం భలే మజాగా ఉంటుందంటారు ప్రేక్షకులు. అందుకే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మన తారలు అప్పుడప్పుడు ఆటగాళ్లుగా మారి బాక్సాఫీస్‌ ముందుకొస్తుంటారు. అలా ఈ సారి ఎవరు రాబోతున్నారో తెలుసుకుందాం.

Tollywood Sports Drama Movie Ramcharan RC 16 sarvanand
బాక్సాఫీస్ బరిలో స్పోర్ట్స్ డ్రామా - అందరి చూపు ఆ హీరోపైనే!

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 7:45 AM IST

Tollywood Sports Drama Movies :స్పోర్ట్స్ డ్రామా మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ క్రీడా నేపథ్య కథల్లోనూ పుష్కలంగా ఉంటాయి. పైగా ఇలాంటి చిత్రాల్లో ఉండే హీరోయిజం స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు హీరోహీరోయిన్లు. అలా ప్రస్తుతం త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారు ఎవరో చూద్దాం.

RC 16 Movie : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు కాంబోలో ఆర్‌సీ16 తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇందులో చరణ్‌ ఏ క్రీడాకారుడిగా కనిపిస్తారన్నది క్లారిటీగా తెలియలేదు. ఫుల్ బాల్ లేదా కబడ్డీ బ్యాక్​డ్రాప్​తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 20న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్ జాన్వీ కపూర్‌. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ 'కార్తికేయ 3' లోడింగ్- న్యూ అడ్వేంచర్ అంటూ నిఖిల్ హింట్

Sarwanand Bike Racer Movie : శర్వానంద్‌ - అభిలాష్‌ దర్శకత్వంలో బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా రాబోతుంది. ఇందులో శర్వా బైక్‌ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక నాయర్‌ హీరోయిన్.

సార్పట్టలో బాక్సర్‌గా కనిపించి ఆకట్టుకున్న తమిళ హీరో ఆర్య ప్రస్తుతం సార్పట్ట 2 కోసం రెడీ అవుతున్నారు. ఇందుకోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో ఆయన బాక్సర్​గా కనిపించనున్నారు. పా.రంజిత్‌ దర్శకుడు.

అనుపమ పరమేశ్వరన్‌ - తమిళ హీరో ధ్రువ్‌ విక్రమ్‌ కాంబోలో మారి సెల్వరాజ్‌ ఓ సినిమా చేస్తున్నారు. కబడ్డీ క్రీడాకారుడు మానతి పి.గణేశన్‌ లైఫ్​లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఇది రాబోతుంది. ఇందులో హీరోతో పాటు అనుపమ కూడా కబడ్డీ క్రీడాకారిణికిగా కనిపిస్తుందా? లేదా? తెలీదు.

Nayanthara Test Movie ; నయనతార, ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కలయికలో క్రికెట్ బ్యాక్​డ్రాప్​తో రాబోతున్న సినిమా టెస్ట్‌. చెన్నైలో జరిగిన ఓ చారిత్రక అంతర్జాతీయ క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ముగ్గురు జీవితాల్ని తీవ్రంగా ఎలా ప్రభావితం చేసిందనేదే ఈ చిత్రం. షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ - సాగర్‌ కె.చంద్ర కాంబో మూవీ టైసన్‌ నాయుడు. 14రీల్స్‌ ప్లస్‌ ప్రొడ్యూస్ చేస్తోంది. పోలీసు అండ్ స్పోర్ట్స్ డ్రామాగా రానుంది. శ్రీనివాస్‌ బాక్సర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.

అయితే ఇంత వరకు క్రికెట్‌, హాకీ, కబడ్డీ, బాక్సింగ్‌, రన్నింగ్‌, రగ్బీ వంటి సినిమాలే వచ్చాయి. తొలిసారి పతంగుల కాంపిటీషన్ బ్యాక్​డ్రాప్​తో పతంగ్‌ అనే ఓ చిన్న సినిమా రాబోతుం ది. ప్రణీత్‌ పత్తిపాటి దర్శకుడు. వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు.

'ఆ హీరోయిన్ అంటే ఇష్టం' - మాస్ మహారాజా రవితేజ!

క్రేజీ న్యూస్​ - రామ్​చరణ్ RC 16లో మరో బాలీవుడ్ స్టార్!

ABOUT THE AUTHOR

...view details