తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టీ20 స్టైల్​లో అందాల భామల దూకుడు - బాక్సాఫీస్ ముందు ఒకేసారి 2,3 చిత్రాలతో - TOLLYWOOD DIWALI 2024 HEROINES

త్వరలోనే రోజుల వ్యవధిలోనే ఒకటికి రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్న అందాల భామలు వీరే!

Rashmika Rukmini Keerthi suresh
Rashmika Rukmini Keerthi suresh (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 6:45 AM IST

Tollywood Diwali 2024 Heroines : చిత్ర పరిశ్రమలో హీరోయిన్​ ఒక సారి క్లిక్​ అయితే చాలు ఆమె జర్నీ యమా స్పీడ్​గా కనిపిస్తుంటుంది. అవకాశాలు రాగానే ఎడాపెడా సినిమాలు చేస్తూ జోరు చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు రోజుల వ్యవధిలోనే ఒకటికి రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ నాయికలెవరు? వారి చిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం.

వారం రోజుల గ్యాప్​లో రెండు చిత్రాలతో - సప్తసాగరాలు దాటి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన భామ రుక్మిణీ వసంత్‌. ఇప్పుడు ఆమె 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్‌ హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. స్వామిరారా, కేశవ చిత్రాల ఈ దర్శకుడు - హీరో కాంబోలో రానున్న మూడో సినిమా ఇది. నవంబరు 8న ఈ రొమాంటిక్ డ్రామా రానుంది. ఈ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం రావడానికి ఓ వారం ముందే దీపావళికి బఘీరాతో పాన్‌ ఇండియా ఆడియెన్స్​ను పలకరించనుంది రుక్మిణీ. శ్రీమురళి హీరోగా డాక్టర్‌ సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ అందించారు. ఇది అక్టోబర్ 31న విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాలతో రుక్మిణి ఎలా రిజల్ట్​ను అందుకుంటుందో.

హ్యాట్రిక్​ సక్సెస్​పై మీనాక్షి కన్ను - వరుస సినిమాలతో సినీ ప్రియుల్ని అలరిస్తోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ వినాయక చవితికి ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు దీపావళికి లక్కీ భాస్కర్‌తో సొగసుల పటాకా పేల్చనుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రమిది. ఇది 31న విడుదల కానుంది. ఇది రిలీజై అయిన రెండు వారాల వ్యవధిలోనే వరుణ్ తేజ్ మట్కాతో (నవంబరు 14), ఆ తర్వాత మళ్లీ రెండు వారాలకు విశ్వక్​ సేన్ మెకానిక్‌ రాకీతో (నవంబర్ 22) రానుంది. ఈ మూడు చిత్రాలతో మీనాక్షి హ్యాట్రిక్‌ సక్సెస్​ సాధిస్తుందా లేదా చూడాలి.

రష్మిక, కీర్తి డబుల్ ట్రీట్​ - గతేడాది యానిమల్‌తో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక పుష్ప 2: ది రూల్‌తో, ఛావాతో రానుంది. పుష్ప 2 డిసెంబర్ 5కు, ఛావా డిసెంబర్ 6న రానుంది. అయితే పుష్ప క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఛావా రిలీజ్ డేట్ వాయిదా వేయొచ్చని టాక్. అదే నెలలో మరో తేదీకి తీసుకొస్తారని అంటున్నారు.

డిసెంబర్​లోనే బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది హీరోయిన్ కీర్తి సురేశ్‌. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కాలీస్‌ దర్శకత్వం వహించారు. తేరికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. ఇదే నెలలో కీర్తి సురేశ్ రివాల్వర్‌ రీటాతోనూ సందడి చేయనుందని తెలుస్తోంది. కె.చంద్రు దీన్ని తెరకెక్కిస్తున్నారు.

'నా బాడీ, నా ఇష్టం - మీరెవరు జడ్జ్​ చేయడానికి!?' - వారిపై మండిపడ్డ అలియా భట్​

'అందరూ ప్రభాస్​నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు'- డార్లింగ్ క్రేజ్​​పై తమన్నా కామెంట్స్!

ABOUT THE AUTHOR

...view details