Sankranthiki Vasthunam Collections : విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 12రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.260 కోట్లు వసూల్ చేసింది. ఇక లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా రూ.300 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కెరీర్లో భారీ హిట్
దగ్గబాటి వెంకటేశ్ కెరీర్లో ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఆయన రూ.100 కోట్ల షేర్ లిస్ట్‌లో చేరారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఈ ఘనత అందుకున్న రెండో హీరోగా నిలిచారు. వెంకీ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి రూ.100 కోట్ల షేర్ అందుకున్నారు. తాజాగా సినిమా భారీ స్థాయిలో వసూల్ చేయడంతో సీనియర్లలో రూ.250 కోట్ల మార్క్ దాటిన తొలి హీరోగానూ రికార్డు కొట్టారు.
#BlockbusterSankranthikiVasthunam continues it's Box Office Sambhavam 💥💥💥
— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025
260crores+ worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥
ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥
Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW
బుకింగ్స్ రికార్డ్స్
ఈ సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ బుకింగ్స్ జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. గత 24 గంటల్లో ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో లక్షా 70వేల టికెట్లు అమ్ముడైనట్లు మూవీ యూనిట్ తెలిపింది. రిలీజ్ నుంచి థియేటర్‌లో 100 శాతం ఆక్యూపెన్సీతో సినిమా రన్ అవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఓవర్సీస్లోనూ జోరు
తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లోనూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు ఫుల్ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడ ఇప్పటికే ఈ సినిమా 2.6 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. త్వరలోనే 3 మిలియన్ల మార్క్ దాటేసే ఛాన్స్ కూడా ఉంది.
కాగా, ఈ సినిమాలో ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు మెరిశారు. భీమ్స్ సిసిరొలియో చక్కటి సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు.
'బుల్లిరాజుకు' బోలెడు ఆఫర్లు- అప్పుడే 15 సినిమాలకు ఓకే!
బాక్సాఫీస్ వద్ద 'సంక్రాంతికి వస్తున్నాం' జోరు - వెంకీ మామ కెరీర్లో ఇదే తొలిసారి!