Mega 157 Heroine : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత 'దసరా' ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పని చేయనున్నారు. నాని సమర్పిస్తున్న మూవీ అవ్వడం ప్లస్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?
'మెగా 157' కోసం ఓ పాపులర్ సీనియర్ హీరోయిన్‌ని సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఎవరో తెలుసా? కొన్ని నివేదికల మేరకు, ఆ బాలీవుడ్ నటి చివరిసారిగా 2000వ ఏడాది కమల్ హాసన్ 'హే రామ్'లో యాక్ట్ చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె దక్షిణాదిలో నటిస్తున్న రెండో సినిమా 'మెగా 157' అవుతుంది. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీకాంత్ ఓదెల ఆమెని కావాలనుకుంటున్నట్లు తెలిసింది.
శ్రీకాంత్ ఓదెల చిరుతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. దీని కోసం 1990ల నేపథ్యంలో భారీ సెట్ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ రోల్ స్టైలిష్‌గా, ఆయన వయస్సుకు సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.