తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలో రియల్ క్రైమ్ స్టోరీ - 18 దేశాల్లో టాప్​ ట్రెండింగ్‌! - The Indrani Mukerjea ott trending

రీసెంట్​గా సంచలన కేసు ఆధారంగా ఓటీటీలో రిలీజైన ఓ క్రైమ్​ డాక్యుమెంటరీ సిరీస్​ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్​లో కొనసాగుతోంది.

OTTలో రియల్ క్రైమ్ స్టోరీ - 18 దేశాల్లో టాప్​ ట్రెండింగ్‌!
OTTలో రియల్ క్రైమ్ స్టోరీ - 18 దేశాల్లో టాప్​ ట్రెండింగ్‌!

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 6:39 PM IST

The Indrani Mukerjea Story Buried Truth OTT Top Trending : ఓటీటీలో ఈ మధ్య కాలంలో వచ్చే కంటెంట్​లు బాగా క్లిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్​ డాక్యుమెంటరీ సిరీస్‍లకు ఆదరణ బాగా పెరుగుతోంది. అలా రీసెంట్​గా వచ్చిన ది ఇంద్రాణి ముఖర్జియా : దిబరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్‍కు బాగా క్రేజ్ వస్తోంది. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయి రీసెంట్​గా నెట్‌ఫ్లిక్స్​లో రిలైజన ఈ సిరీస్​ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఫిబ్రవరి 29 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ దూసుకెళ్తోంది. మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ సిరీస్‌ టాప్10లో కొనసాగుతోంది. కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు 18 దేశాల్లో ప్రస్తుతం ఇది టాప్ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 2.2 మిలియన్ల గంటల వాచ్‌టైమ్‌ను నమోదు చేసుకున్నట్లు తెలిసింది. భారీ ప్రేక్షకాదరణతో ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న అవతార్‌, లవ్‌ ఈజ్ బ్లైండ్‌ల రికార్డులను ఈ సిరీస్​ 10 రోజుల్లోపే చేరుకోవడం విశేషమనే చెప్పాలి.

అసలేంటి ఈ కథ 2012 షీనా బోరా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో చాలా మందికి తెలిసిన విషయమే. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సెన్సేషన్ అయింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను గట్టిగా విచారించగా అతడే దీనిని బయట పెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని సంచలన విషయాన్ని చెప్పాడు.

ఇంద్రాణీ అనే మహిళ తన మొదటి భర్త నుంచి విడిపోయి తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల దగ్గరే ఉంచి పెంచింది. ఆమె కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను వివాహమాడింది. అయితే ఈ క్రమంలోనే పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా ముంబయికి వెళ్లి ఆమెను కలుసుకుంది. అనంతరం ఆమెకు పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఈవిషయంలో తల్లీ కుమార్తెల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఆర్థిక విభేదాలూ కూడా తలెత్తాయి. దీంతో ఇంద్రాణీ తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌రాయ్‌ సాయంతో కుమార్తె షీనాను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!

పాపం పూజా హెగ్డే - ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

ABOUT THE AUTHOR

...view details