Thandel Movie Interesting Facts :టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. 'తండేల్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఫిబ్రవరీ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
'తండేల్' అనేది గుజరాతి పదం. లీడర్ అని దాని అర్థం. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు గుజరాత్ పోర్ట్‌కి వెళ్లిన సమయంలో అనుకోకుండా పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్ అవుతారు. అయితే వారు ఆ చెర నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. స్టోరీని మరింతగా కనెక్ట్ చేసేందుకు రాజు-సత్య అనే ఫిక్షనల్ లవ్ స్టోరీని జోడించారు మేకర్స్.
మత్స్యకారుల జీవన నేపథ్యంపై ఈ సినిమా తెరకెక్కడం వల్ల ఇందులో చాలా మంది వ్యక్తులను అలాగే కొంతమంది రాజకీయనాయకుల గురించి చూపించడం వల్ల సెన్సార్ సమయంలో మేకర్స్ ఇబ్బంది పడాల్సి వచ్చిందట. అంతేకాకుండా చాలా మంది దగ్గర పర్మిషన్స్ తీసుకురావాల్సి వచ్చిందట.
గతంలో ఎన్నడూలేని విధంగా డీగ్లామర్ లుక్‌లో చైతూ, సాయి పల్లవి కనిపించనున్నారు. సముద్రంలో, ఎండలో, ఇసుకలో చిత్రీకరించిన సీన్స్ కోసం ఈ ఇద్దరూ బాగా కష్టపడ్డారట. ఇక ఈ చిత్రంలో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.