Naga Chaitanya Thandel Movie Promotions : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సినిమా 'తండేల్'. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఫిబ్రవరీ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నేనింకా సంతృప్తి చెందలేదు'
తన కెరీర్లో వచ్చిన చిన్నచిన్న విజయాలతో తాను సంతృప్తి చెందలేదని చైతూ తెలిపారు. తన తదుపరి ప్రాజెక్ట్‌లతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కసితో ఉన్నానని పేర్కొన్నారు. తన సినీ కెరీర్లో మరిన్ని మంచి పాత్రలను పోషించాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. అప్పటి వరకు తన సినీ ప్రయాణం ఆగదని వెల్లడించారు.
"నా సినీ కెరీర్ విషయంలో నేను ఇప్పటికీ వంద శాతం సంతృప్తి చెందలేదు. ఇంకా చాలా చేయాల్సి ఉందని భావిస్తున్నాను. నేను ఇప్పుడు తండేల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. అది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. కానీ నేను ఇక్కడితో ఆగిపోను. నేను ఇంకా నటనపై కసితో ఉన్నాను. ప్రేక్షకులు ఆనందించే ఒక అద్భుతమైన పాత్రను పోషించాలని ఆసక్తిగా ఉన్నాను. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన కోరిక నాకు ఉంది. నా సినీ జీవితంలో చాలా అన్వేషించాల్సి ఉంది. స్కిల్స్‌ను నేర్చుకోవాలి. సినిమా రిలీజ్ తర్వాత ఏ సీన్లో ఎలా నటించానన్న దాని గురించి చింతించను." అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
సినిమా విషయానికొస్తే
శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్ లుక్‌లో సాయి పల్లవి కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుంది. అలాగే సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి.
'అఖిల్, బన్నీతో మల్టీస్టారర్!'- చైతూ ఛాయిస్ ఎవరంటే?
'ఆ ఒక్క సీక్వెన్స్‌కే రూ.18కోట్లు ఖర్చు అయింది' - 'తండేల్' డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్