IMD Officer On Telangana Weather Report : రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రవీంద్రకుమార్ వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఆయన వివరించారు.
రాబోవు 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం : రాబోవు మూడు రోజుల పాటు తూర్పు, ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు రవీంద్ర కుమార్ వెల్లడించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఒకటి, రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఆయన తెలిపారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లుగా రవీంద్ర కుమార్ తెలిపారు. హైదరాబాద్లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఆయన వెల్లడించారు.
"రాబోవు మూడు రోజుల్లో ఖమ్మం, భద్రాచలంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఒకటి నుంచి రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తోంది. "- రవీంద్ర కుమార్, వాతావరణ కేంద్రం అధికారి
ఆ జిల్లాలో పొగమంచు అధికంగా ఉండే అవకాశం : వాయువ్యం దిశ నుంచి వీచే గాలుల్లో తేమశాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోతకు అవకాశం ఉంటుందని వాతావరణ అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పొగమంచు ప్రస్తుతం తగ్గిందని ఉటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, ములుగు జిల్లాలు లాంటి ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని వివరించారు.
ఎండలు బాబోయ్ ఎండలు - అడుగు బయట పెడితే సెగలే సెగలు - HIGH TEMPERATURE IN TELANGANA