Telangana Rythu Bharosa Funds Released Today : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది యాసంగి సీజన్ పురస్కరించుకుని రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ రెండు ఎకరాలలోపు విస్తీర్ణం సాగులో ఉన్న భూములకు రైతు భరోసా పథకం నిధులు నేటి నుంచి జమ మొదలైంది. 11,79,247.17 ఎకరాల భూములకు 8,65,999 మంది రైతులకు 7,07,54,84,664 రూపాయలు రైతు భరోసా సాయం అందజేయనున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
జనవరి 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 577 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రైతు భరోసా పథకం నిధుల సాయం జమ సాగింది. 9,48,332.35 ఎకరాల భూములకు 4,41,911 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 5,68,99,97,265 రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 5న ఎకరా లోపు 9,29,234.20 ఎకరాల విస్తీర్ణం భూములు సంబంధించి 17,03,419 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 5,57,54,07,019 రూపాయలు జమ చేశారు.
బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే : ప్రస్తుతానికి రెండు ఎకరాలలోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దశల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత ఉన్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే సంబంధిత ఏఈవో లేదా ఏవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? - వెంటనే వారిని సంప్రదించండి
తెలంగాణ రైతులకు శుభవార్త - రైతు భరోసా నిధులు విడుదల - మీ ఖాతాలో జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి