తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సారీ చెప్పరా' - మాస్ ఫీస్ట్​గా సన్ని దేఓల్ 'జాట్' టీజర్! - JAAT TEASER RELEASED

టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న కొత్త సినిమా 'జాట్' టీజర్ రిలీజ్.

Sunny Deol JAAT Teaser
Sunny Deol JAAT Teaser (source IANS)

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 3:37 PM IST

Sunny Deol JAAT Teaser : బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ సన్నీ దేవోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'జాట్‌' పేరుతో ఇది రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్​, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇది షూటింగ్​ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్​లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్​ను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. పూర్తి పక్కా యాక్షన్‌ మోడ్​తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతానికి హిందీ వెర్షన్‌ టీజర్​ను రిలీజ్‌ చేశారు మేకర్స్. త్వరలోనే ఇది తెలుగులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. సినిమాలో రెజీనా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్‌ హుడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రిషి పంజాబి సినిటోగ్రాఫర్‌ కాగా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2025లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details