తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హీరామండి చూసిన వెంటనే మనీషాకు సారీ చెప్పాను' - సోనాక్షి ఎమోషనల్ - Sonakshi Sinha Heeramandi - SONAKSHI SINHA HEERAMANDI

Sonakshi Sinha Heeramandi : 'హీరామండి' సిరీస్ చూసిన తర్వాత తన కోస్టార్ మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు బాలీవుడ్ బ్యూటీ​ సోనాక్షి సిన్హా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంతకీ ఏమైందంటే?

Sonakshi Sinha Heeramandi
Sonakshi Sinha Heeramandi (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 1:49 PM IST

Sonakshi Sinha Heeramandi :Sonakshi Sinha Heeramandi : ప్రస్తుతం ఎక్కడ చూసిన 'హీరామండి' గురించే టాక్ నడుస్తోంది. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిన ఈ సిరీస్​ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో విడుదలై ట్రెండ్​ అవుతోంది. స్టోరీ, విజువల్స్​, నటీనటులు ఇలా అన్ని అంశాల్లో మంచి మార్కులు అందుకుంది. మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు.

ఇక ఇందులో సొనాక్షి డ్యూయెల్ రోల్ చేసింది. రెహన్నా అనే తల్లి పాత్రతో పాటు ఫర్దీన్ అనే కూతురి పాత్ర కూడా చేసింది. అయితే ఈ సిరీస్ వద్ద మనీషా కోయిరాలాకు నటి సొనాక్షి సారీ చెప్పిందట.

"నాకు ఆమె అంటే చాలా ఇష్టం, ఆ సిరీస్ చూసిన తర్వాత నేను వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాను. నేను అంతగా కఠినంగా తనతో ఎలా ఉండగలిగాను నేను అనిపించింది. ఎందుకంటే మనీషా గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆవిడ నటన అంటే చాలా ఇష్టం. అలాంటి గొప్ప నటితో నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా పాత్రలో బాగా నటించడానికి నాకు చాలా సహకారం అందించారు. మనీషాతో కలిసి ఈ సిరీస్​లో నటించడం బాగా ఎంజాయ్ చేశాను. బన్సాలీతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. అసలు నాకు ఈ సినిమాలో ఎక్కువ సీన్స్ లేవు. నా సీన్స్ ఘాట్ అయిపోయాక మళ్లీ ఒక్కొక్కటి పెంచారు. నేను నటించడానికి నా మీద ఎక్కువ ఒత్తిడి పెట్టలేదు. అందుకే ఆ పాత్రలో సహజంగా నటించగలిగాను అది చూసిన బన్సాలీ నన్ను అభినందించారు" అని సోనాక్షి చెప్పింది.

ఇదిలా ఉండగా, ఈ సిరీస్​లోని ఓ సీన్ కోసం మనీషా కోయిరాలా ఓ పెద్ద సాహసం చేసింది. ఏకంగా 12 గంటల పాటు బురద నీటిలో ఉన్నట్లు తెలిపింది.

"ఒక సీన్ కోసం 12 గంటలు ఫౌంటెన్ కిందే ఉండాల్సి వచ్చింది. అయితే సంజయ్ నీరు వేడిగా, శుభ్రంగా ఉండేలా చూశారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ బురద నీరు కూడా రావడం ప్రారంభమైంది. నా శరీరం మొత్తం బురద నీటితో తడిచిపోయింది. అసలే క్యాన్సర్​ నుంచి కోలుకున్న శరీరం సున్నితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో బురద నీటితో అంతసేపు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది పడలేదు. అప్పుడే అర్థమయింది అనారోగ్యం వల్ల, వయసు వల్ల లేదా ఇంకేదైనా సమస్య వల్ల మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ కష్టపడితే అంతకుమించి ఫలితాలను పొందచ్చు. మీ అభిమానానికి కృతజ్ణతలు" అంటూ పోస్ట్​లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది మనీషా కోయిరాల.

షూటింగ్​లో మద్యం తాగి చిందులేసిన ప్రముఖ హీరోయిన్! - Richa chadha Heeramandi

థియేటర్ల బంద్​తో బోరింగా? - OTTలో ఉన్న ఈ 12 క్రేజీ సినిమా/సిరీస్​లు మీకోసమే! - Telangana Theatres Close

ABOUT THE AUTHOR

...view details