Singer Who Has Rs.200 Cr Networth : సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎంత ముఖ్యమో అందులోని సాంగ్స్ కూడా అంతే ముఖ్యం. ఇక పాటకు అనుగుణంగా వాయిస్‌లకు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటుంటారు మేకర్స్. ఆ సాంగ్‌ను ఎవరి చేత పాడిస్తే బెటర్ అవుట్‌పుట్ వస్తుందన్న ఆలోచనతో ఉంటారు. అందుకోసమని నిష్ణాతులను ఎంచుకుంటుంటారు. ఇప్పటికే మనం ఎంతో మంది స్టార్ సింగర్స్‌ను చూసుంటాం. అందులో కొంత మంది సంప్రదాయ సంగీతం నేర్చుకుని ఈ ఫీల్డ్‌లోకి వచ్చుంటారు. లేకుంటే ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గర కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుంటారు. అయితే ఎటువంటి సంగీతం నేర్చుకోకుండా.. ఏ మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కూడా ఓ సింగర్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఆయనెవరంటే ?
అయితే పైన మనం మాట్లాడుకున్న వ్యక్తి ఇండియన్ సింగర్ కాదు. ఆయన పాకిస్థాన్ లోని వజీరాబాద్‌లో ఉండే పంజాబీ ఫ్యామిలీలో 1983లో పుట్టిన అతీఫ్ అస్లామ్. రావల్పిండి ప్రాడెక్ట్ అయిన ఈ స్టార్ ఇప్పుడు బీటౌన్‌తో పాటు సౌత్‌ను తన సంగీత సాగరంలో ముంచి తేల్చుతున్నారు. అయతే ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. తన టీనేజ్ డేస్‌ను ఆయన రెస్టారెంట్లలో గడిపారు. అక్కడ పాటలు పాడి అందరిని అలరించారు.
అలా చిన్న చిన్న పెర్ఫామెన్స్లు ఇస్తున్నప్పుడు అక్కడ ఆయనకు గోహర్ ముంతాజ్ అనే మరో మ్యూజిషియన్ పరిచమయ్యారు. ఇక ఈ ఇద్దరూ కలిసి 'జల్' అనే బ్యాండ్‌ను ప్రారంభించారు. ఈ పేరుతో మ్యూజికల్ షో స్ను చేసేవారు. 2003లో 'ఆదత్' అంటూ వచ్చిన వైరల్ సాంగ్ కూడా వీరిద్దరూ కలిసి ఆలపించిందే. ఆ తర్వాతి 2004లో అతీఫ్ సోలోగా రూపొందించిన ఆల్బమ్ 'జల్ పరీ' విడుదలైంది. దాని తర్వాత అతీఫ్ అస్లామ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.