తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అవార్డు వేడుకల్లో పరోక్ష కామెంట్స్​ - ఆర్యన్‌ ఖాన్‌ కేసు రోజులను గుర్తుచేసుకున్న షారుక్​! - SHAHRUKH KHAN IIFA AWARDS 2024 - SHAHRUKH KHAN IIFA AWARDS 2024

Shahrukh Khan IIFA Award Speech : అబుదాబి వేదికగా జరిగిన 'ఐఫా' అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసు గురించి పరోక్షంగా మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Shahrukh Khan IIFA Award Speech
Shahrukh Khan IIFA Award Speech (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 11:59 AM IST

Sharukh khan IIFA Award Speech : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ తాజాగా తన తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఇటీవలె జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆయన ఆ స్టేజీపైన కీలక వ్యాఖ్యలు చేశారు.

"నాతోపాటు ఈ విభాగానికి నామినేట్‌ అయిన రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విక్రాంత్‌ మస్సే, విక్కీ కౌశల్‌, సన్నీ దేవోల్‌కు అభినందనలు. చాలా కాలం తర్వాత నేను వర్క్‌ చేసిన మూవీ జవాన్. మూవీ యూనిట్​కు ధన్యవాదాలు. పర్సనల్ విషయాలు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. (ఆర్యన్‌ ఖాన్‌ కేసు ఉద్దేశించి) ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఈ సినిమా కోసం పనిచేశాను. మూవీ టీమ్ అంతా నాకు చాలా సపోర్ట్‌ చేశారు. అలాగే జవాన్ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన గౌరీఖాన్​కు కృతజ్ఞతలు." అంటూ షారుక్ తన స్పీచ్​ను ముగించారు.

ఇక తనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు ఐఫా, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు షారుక్ ఖాన్. మణిరత్నం, ఏఆర్‌ రెహమాన్‌ చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తన లైఫ్​లో ఇదొక గ్రేట్‌ మూమెంట్‌ అని కొనియాడారు. మణిరత్నం, రెహమాన్​తో కలిసి పనిచేశానని, వారిని తాను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ఫిల్మ్‌ మేకింగ్​కు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ లెజెండ్స్‌ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. అవార్డులు అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.

పుష్ప సాంగ్​కు షారుక్, విక్కీ స్టెప్పులు
కాగా, అబుదాబి వేదికగా జరిగిన ఐఫా వేడుకలకు షారుక్ ఖాన్, కరణ్‌ జోహార్‌, విక్కీ కౌశల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ' పాటకు షారుక్‌ - విక్కీ కౌశల్ స్టెప్పులు వేశారు. దీంతో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ కేసు
ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం, అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటం వల్ల 2021లో ఈ కేసు సంచలనం సృష్టించింది. అదే ఏడాది అక్టోబరు 3న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్​ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్, అక్టోబరు 30న బెయిల్​పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్ సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడం వల్ల ఈ కేసులో ఎన్​సీబీ అతడికి ఇటీవల క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

బెస్ట్​ యాక్టర్​గా నాని - చిరంజీవి, బాలయ్యకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు - IIFA Utsavam 2024

ఐఫాలో బీటౌన్​ హవా! బెస్ట్ మూవీగా 'యానిమల్​'- 'జవాన్​'కూ అవార్డుల పంటే! - IIFA Awards 2024

ABOUT THE AUTHOR

...view details