Sankrantiki Vasthunnam Collection :దగ్గుబాటి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శితమౌతూ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం మరో అరుదైన రికార్డు కొట్టింది.
ఐదో రోజైన అదివారం ఈ చిత్రం రూ.12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తొలి స్థానంలో 'ఆర్‌ఆర్ఆర్' (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో ప్లేస్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' (రూ.12.75కోట్లు) నిలిచింది. ఇక ఆ లిస్ట్‌లో మూడులో 'అల వైకుంఠపురం' (రూ.11.43 కోట్లు), నాలుగులో 'బాహుబలి 2' (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో రూ.10.86 కోట్లతో 'కల్కి 2898 ఏడీ' సినిమాలు ఉన్నాయి.
అక్కడ కూడా
ఓవర్సీస్లోనూ వెంకటేశ్ హవా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. వెంకటేశ్ కెరీర్లో ఈ మైలురాయి అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో హీరో వెంకీ ఓవర్సీస్ ఆడియెన్స్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.