Sankranthiki Vasthunam Day 1 Collection :టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్- డైరెక్టర్ అనిల్ రావిపుడి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. పండుగ కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ అందుకుని థియేటర్లలో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించిందని తాజాగా మూవీ టీమ్ వెల్లడించింది.
ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ సినిమా సుమారు 7 లక్షల డాలర్లను వసూలు చేసిందని మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. వెంకీ కెరీర్‌లోనే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. ఇక ఇది విన్న వెంకీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా వన్ మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమంటూ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్). అతనితో స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి, ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్ వి.కె) తనను హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు. అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు.