ETV Bharat / entertainment

కార్చిచ్చు వల్ల ఆస్కార్‌ వేడుకలు పోస్ట్​పోన్!​- '96 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు!' - OSCAR NOMINATIONS

కార్చిచ్చు వల్ల ఆస్కార్‌ వేడుకలు పోస్ట్​పోన్!​- అకాడమీ స్పందన ఇదే!

Oscar Nominations
Oscar Nominations (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 12:12 PM IST

Oscar Nominations 2025 : అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది జరగాల్సిన ఆస్కార్‌ వేడుకలు రద్దు కానున్నాయన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఫిల్మ్‌ అకాడమీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అటువంటి నిర్ణయాలేవీ తాము తీసుకోలేదంటూ అకాడమీకి చెందిన ఓ సభ్యురాలు తెలిపారు. అయితే ఒకవేళ వేడుకల్లో ఏదైనా మార్పులు ఉంటే ఆ విషయాన్ని ఫిల్మ్‌ అకాడమీనే స్వయంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

సుమారు 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేయలేదని, కొవిడ్‌ వల్ల మాత్రం ఒక్కసారి వాయిదా మాత్రమే వేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 1000 మంది ఈ వేడుకల వల్ల ఉపాధి పొందుతున్నారని అన్నారు.

వారి ఇళ్లు దగ్ధం
ఇదిలా ఉండగా, ఈ కార్చిచ్చు వల్ల అకాడమీకి చెందిన నలుగురు సభ్యుల ఇళ్లు బూడిదయ్యాయట. ఈ క్రమంలోనే ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది.

"లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఓటింగ్‌ వ్యవధిని మేము పొడిగించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలోనే నామినేషన్లు ప్రకటించడానికి గల తేదీని మార్చాలని, అంతేకాకుండా సభ్యులకు తగినంత అదనపు సమయం ఇవ్వాలనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము" అని అకాడమీ అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌, సీఈవో బిల్‌ క్రేమర్‌ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక భారత్‌ నుంచి ఆరు చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్​ నామినేషన్ల బరిలో నిలిచాయి. పృథ్వీరాజ్​ సుకుమార్ 'ది గోట్‌ లైఫ్‌' (హిందీ), సూర్య 'కంగువ' (తమిళం), 'స్వాతంత్ర్య వీర్‌ సావర్కర్‌' (హిందీ), 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' (మలయాళం), 'గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌'( హిందీ, ఇంగ్లిష్‌), 'సంతోశ్' (హిందీ) సినిమాలు పోటీపడుతున్నాయి.

మరోవైపు లైవ్ యాక్షన్ షార్ట్​ ఫిల్మ్ విభాగంలో భారతీయ లఘు చిత్రం 'అనుజా' అర్హత సాధించింది ఈ విభాగంలో 180 షార్ట్ ఫిల్మ్స్​ ​ షార్ట్​లిస్ట్​ చేయగా 'అనుజా' టాప్ 15లో స్థానం దక్కించుకుంది.

ఆస్కార్ రేస్ నుంచి 'లాపతా లేడీస్' ఔట్- ఇక ఆశలన్నీ ఆ సినిమాపైనే!

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్​ - ఆస్కార్‌ నామినేషన్లు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.