ETV Bharat / state

ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన ఉన్నత విద్యా మండలి - VARIOUS ENTRANCE EXAMS

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ - పరీక్ష తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి - మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఈఏపీసెట్‌

VARIOUS ENTRANCE EXAMS
HIGHER EDUCATION COUNCIL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 2:50 PM IST

Updated : Jan 15, 2025, 4:22 PM IST

Higher Education Council Announces Dates for Entrance Exams : రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించే వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈఏపీసెట్, ఎడ్​సెట్, లాసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది.

పరీక్షలు జరిగే తేదీలు వివరాలతో పూర్తి సమాచారం :

పరీక్ష పేరు ప్రవేశ పరీక్ష తేదీ
అగ్రికల్చర్ఏప్రిల్ 29
ఫార్మసీఏప్రిల్30
ఈసెట్మే 12
ఎడ్​సెట్జూన్​ 1
లాసెట్, పీజీ లాసెట్జూన్ 6
ఐసెట్జూన్ 8, 9
పీజీఈసెట్

జూన్ 16 నుంచి 19

వరకు

ఇంటర్ విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు వివిధ తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 12న ఈసెట్​ను, ఎడ్​సెట్​ను జూన్​ 1 న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. వీటితో పాటు జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్ ఒకేరోజు నిర్వహిస్తున్నారు. జూన్ 8, 9 తేదీలల్లో ఐసెట్, జూన్ 16 నుంచి మొదలుకుని 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.

కన్వీనర్‌లుగా అధ్యాపకులు : ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎప్‌సెట్ జరగనుంది. ఎప్‌సెట్ పరీక్షలు జేఎన్టీయూహెచ్ నిర్వహించనుండగా ప్రొఫెసర్ డీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ మే 12న జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్ గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహిస్తారు. బీఈడీ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్‌సెట్ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఎల్ఎల్‌బీ ప్రవేశాల కోసం లాసెట్ ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్‌సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు.

ఎంబీఏ, ఎంసీఏ కోసం ఐసెట్ : లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. విజయలక్ష్మిని నియమించారు. ఎంబీఏ, ఎంసీఏ డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. ఐసెట్‌ను మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుండగా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలువాల రవి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ. అరుణ కుమారి వ్యవహరిస్తున్నారు.

వ్యాయామ విద్య కోర్సులు డీపెడ్, బీపెడ్‌ల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్.ఎస్. దిలీప్ ఉన్నారు. పీఈసెట్ మినహా మిగతా ఎంట్రెన్సులన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. పీఈసెట్‌లో శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు మార్చి, ఏప్రిల్‌లో ముగిసేలా బోర్డులు, యూనివర్సిటీలు ప్రణాళిక చేస్తున్నాయి.

ఇకపై పది పాసైతే చాలు - ఎంట్రెన్స్​ టెస్ట్ లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి!

టీఎస్ ఈఏపీసెట్​గా మారిన ఎంసెట్, మే 9 నుంచి ప్రవేశపరీక్షలు

Last Updated : Jan 15, 2025, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.