ETV Bharat / state

కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ? - ఈ 25 టిప్స్​ పాటించండి! - ICMR AND NIN HEALTH TIPS 2025

ఆరోగ్యానికి ఐసీఎమ్ఆర్ 25 సూత్రాలు - ఆయుష్షును పెంచే అలవాట్లు ఇవే

Health Tips 2025
ICMR And NIN Health Tips 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2025, 2:53 PM IST

ICMR And NIN Health Tips 2025 : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే క్రమంలో చాలా మంది ఆరోగ్యం, ఫిటనెస్​ విషయంలో పలు తీర్మానాలు చేసుకుంటారు. ఎక్కువ మంది రోజూ వ్యాయామాలు చేయాలని, ఆయిల్ ఫుడ్​కు దూరంగా ఉండాలని, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ తీసుకుంటారు. కొంత మందిని చూస్తుంటే నూతనోత్సాహానికి నిలువెత్తు దర్పణంలా కనుబడుతుంటారు. మనం కూడా వాళ్లలా కావాలంటే ఎలా అని ఆలోచిస్తుంటాం. కానీ అది ఎలాగో తెలియక అందరినీ అడుగుతుంటాం. అలాంటి వారి కోసమే కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత వైద్య పరిశోధన మండలి(ICMR), జాతీయ పౌష్టికాహార సంస్థ (NIN) 25 ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ ఇటీవల విడుదల చేసింది.

25 ఆరోగ్య చిట్కాలు : -

  1. మంచి డైట్‌ పాటించాలి. అన్ని పోషకాలూ ఒకే ఆహారంలో ఉండవు. చక్కటి పోషకాలుండే వివిధ రకాల ఆహార పదార్థాలను మీ మెనూలో ఉంచుకోవాలి.
  2. రోజూ రెండు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.
  3. సీజనల్‌ పండ్లు, కూరగాయలను తప్పకుండా తినాలి.
  4. కెఫిన్ తీసుకోవడాన్ని తగ్గించుకోండి. శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూసుకోవాలి.
  5. అధిక ప్రొటీన్‌, తక్కువ కొవ్వులతో కూడిన లీన్‌ మీట్‌ను తీసుకోవాలి.
  6. మనం తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. మీ ఆహారాన్ని లవంగాలు, దాల్చిని చెక్క, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారుచేసుకోవాలి.
  7. ఎక్కువ చక్కెర పదార్ధాలను తీసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
  8. అల్ట్రా ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.
  9. వివిధ రకాల నూనెలను తగ్గువగా వాడటం అలవాటు చేసుకోండి.
  10. పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తినడం మంచిది.
  11. ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లను చదివి వాటిలో ఉన్న పోషక విలువలు తెలుసుకోండి.
  12. పాలిష్‌ చేసిన ధాన్యాలకు బదులు ముడిధాన్యాలే ఆరోగ్యానికి మంచివి.
  13. బయట దొరికే ఆహారం తినడం తగ్గించి ఇంట్లో తయారు చేసిన మంచి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  14. ఇల్లు, ఆఫీసుల్లో మెట్లు ఎక్కి వెళ్తే వ్యాయామం చేసినట్లు అవుతుంది. అందుకే మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి.
  15. ఏ ఆహారాన్నయినా ఎమోషనల్‌గా తినొద్దు. రుచిని ఆస్వాదిస్తూ తినాలి.
  16. మనం భోజనం చేసే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకోండి.
  17. మానసిక ప్రశాంతత కోసం రోజూ ధ్యానం చేయడం మంచిది.
  18. ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చొని ఉండొద్దు. మధ్య మధ్యలో బ్రేక్‌లు తీసుకోండి.
  19. రోజూ గంట సేపు వ్యాయామం చేయండి. ఫిట్‌గా ఉంటారు.
  20. ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు మిఠాయిలు కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి.
  21. స్క్రీన్‌ టైంను తగ్గించండి. స్వీయ సమయాన్ని పెంచుకోండి.
  22. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి.
  23. సూర్యకాంతిని ఎంజాయ్‌ చేయండి. విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంది.
  24. ముడి ఆహారపదార్థాలు, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచండి. తద్వారా ఆహార కల్తీని నివారించండి.
  25. మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని ట్రై చేయండి.

ఈ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటిస్తే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. ఈ కొత్త సంవత్సరంలో శారీరక, మానసిక ఆరోగ్యంతో ఆనందమయ జీవితం కోసం ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సూచనలను అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నించండి.

ఉప్పు లేకుండా టేస్టీ ఫుడ్​- ఈ 'ఎలక్ట్రిక్ సాల్ట్​ స్పూన్​'తో తింటే మీ హెల్త్​ అంతా సెట్!

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.