ETV Bharat / entertainment

పండుగ స్పెషల్​! - లోకల్‌ ఛానల్‌లో 'గేమ్‌ ఛేంజర్‌'! - నిర్మాత ఫైర్​! - GAME CHANGER IN LOCAL TV

లోకల్‌ ఛానల్‌లో 'గేమ్‌ ఛేంజర్‌'! - టాలీవుడ్‌ నిర్మాత ఫైర్​! - 'సేవ్​ ద సినిమా' అంటూ నెట్టింట రిక్వెస్ట్!

Game Changer
Game Changer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 1:24 PM IST

Game Changer AP Local Tv : సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' ప్రస్తుతం థియేటర్లలో మిక్స్​డ్​ టాక్​తో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజై వారం రోజలు కూడా అవ్వకుండానే పైరసీ బారిన పడి ఓ లోకల్‌ టీవీ ఛానల్‌లో ప్రసారమైంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఓ వ్యక్తి నెట్టింట షేర్‌ చేయగా, టాలీవుడ్‌ నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కేఎన్‌) స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

"తాజాగా జరిగిన ఈ ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దాదాపు 5 రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను లోకల్‌ ఛానల్స్​లో అలాగే బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు. ఇది నన్ను ఎంతో ఆందోళన కలిగించింది. ఒక సినిమా అంటే కేవలం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్సే కాదు 4 సంవత్సరాల కృషి కూడా. వేలాది మంది కలల ఫలితం ఇందులో ఉంటుంది. అటువంటి దాన్ని ఇలా లీక్‌ చేసే ముందు సినిమా సక్సెస్​పై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించండి. ఇటువంటి పనులు వల్ల ఇండస్ట్రీ ఫ్యూచర్​కు కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన టైమ్​ వచ్చేసింది. సినిమాను కాపాడటానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం" అని ఎస్​కేఎన్​ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. దీంతో పాటు ఆయన #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌నూ ఆ పోస్ట్​కు జోడించారు.

కాగా, భారీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్​ జానర్​లో శంకర్ ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రామ్​ చరణ్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్​లో నటించారు. కేవలం పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. యస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై దిల్​రాజు నిర్మించారు.

'గేమ్ ఛేంజర్' ఫస్ట్​ డే కలెక్షన్స్ - వరల్డ్​వైడ్​గా ఎంత వసూలు చేసిందంటే?

'కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌'- గేమ్​ఛేంజర్ రిజల్ట్​పై ఉపాసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.