Keerthy Suresh About Samantha : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమ కో స్టార్స్‌తో బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వారిని చూసుంటాం. అటువంటి వారిలో సమంత, కీర్తిసురేశ్ పేర్లు బాగా వినిపిస్తుంటాది. ఈ ఇద్దరూ ఎప్పటి నుంచి మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. పలు ఈవెంట్స్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే సమంతపై తన ఇష్టాన్ని పలు సందర్భాల్లో చెప్పుకున్న కీర్తి, తాజాగా మరోసారి సామ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆమె హాజరైన ఓ ఇంటర్వ్యూలో సమంతకు సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపారు కీర్తి. ఇంతకీ అందులో ఏముందంటే?
'ఇటువంటివి నీకు మాత్రమే సాధ్యం'
"సమంత నీతో నాకు ఉన్న రిలేషన్‌ను ఎలా వర్ణించాలో, ఎక్కడ నుంచి ప్రారంభించాలో నాకు తెలియట్లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినప్పటికీ ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసున్నట్లుగా అనిపిస్తోంది. ఏ విషయంలోనైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వడ్గా ఉంటావు మహిళల కోసం ముందుకొస్తావు. నాకు ఎన్నో విషయాల్లో ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటావు. నిన్ను ఫ్రెండ్ అనడం కంటే సోదరి అని పిలవడం నాకు ఎంతో ఇష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇటువంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. లైఫ్ నీకు ఎన్ని ఛాలెంజెస్ ఇచ్చినా కూడా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది" అని ఓ వాయిస్ మెసేజ్‌ను పంపారు. ఇదిలా ఉండగా, ఈ వాయిస్ మెసేజ్‌పై స్పందించిన సమంత ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
'ఆమె వల్ల ఈ ఛాన్స్'
'బేబీ జాన్'తో బాలీవుడ్లో అవకాశం రావడానికి కూడా సమంతనే కారణమని కీర్తి ఇటీవల చెప్పారు. తమిళ చిత్రం 'తెరి'కి రీమేక్‌గా ఇది రూపొందగా, ఆ సినిమాలో హీరోయిన్గా సామ్ నటించారు. అయితే 'తెరి' రీమేక్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పుడు వారికి కీర్తి పేరును సజెస్ట్ చేసింది సమంతానేనట. అలా తనకు 'బేబీ జాన్'లో అవకాశం వచ్చిందని కీర్తి తెలిపారు.
'మహానటి' సినిమాను ఫస్ట్ రిజెక్ట్ చేశా - ఆయన సపోర్ట్ వల్లే ఓకే చెప్పాను : కీర్తి సురేశ్
'వాళ్లు సెకండ్ హ్యాండ్ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత