Samantha Citadel Honey Bunny Telugu Review :వరుణ్ ధావన్ , సమంత కీలక పాత్రల్లో రూపొందించిన లేటెస్ట్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ'. ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందంటే?
స్టోరీ ఏంటంటే?
హనీ (సమంత) నైనిటాల్‌లోని ఓ కెఫేలో పనిచేస్తుంటుంది. ఆమెకు నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో హనీని ఓ వ్యక్తి అనుసరిస్తూ ఉంటాడు. అది గమనించిన ఆమె అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పట్టుబడుతుంది. అయితే ఆ చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్తుంది. కానీ హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికీ వెళ్తారు.
మరోవైపు విదేశాల్లో ఉన్న బన్నీ చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అయితే హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? ఎంతటి వారితోనైనా పోరాడే సామర్థ్యం ఆమెకు ఎలా వచ్చింది? ఇంతకీ ఆమె గతం ఏంటి? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు హనీని, అలాగే తన బిడ్డ నాడియాను బన్నీ కలిశాడా? అయితే ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్) ఒకవైపు, 'సిటడెల్' టీమ్ మరోవైపు వెతుకుతున్న అర్మార్డ్ అనే వస్తువు ఏంటి? చివరకు అది ఎవరి చేతికి చిక్కింది? అన్న విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
కథపరంగా ఈ సిరీస్‌లో కొత్తదనం లేకపోయినా, దాన్ని తెరపైకి తీసుకురావడంలో రాజ్ అండ్ డీకే టీమ్ బాగా కష్టపడింది. ఇక వీళ్లు ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా కట్ చేసి అప్లోడ్ చేశారు. ఒకటి 1992లో మరొకటి 2000 ఏడాదిలో జరుగుతున్నట్లు చూపిస్తూ నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఈ కథను నడిపించారు. ప్రస్తుతం జరిగే కథ, అందులోని పాత్రలకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసినా, ఎక్కడా గందరగోళం లేకుండా ప్రతి సీన్‌ను చక్కగా తెరపై చూపించారు. అయితే సిరీస్‌లోని కీలక పాత్రలు అలాగే వారి బ్యాక్‌గ్రౌండ్, వారిని కథా ప్రపంచాన్ని పరిచయం చేయడానికే మొదటి రెండు ఎపిసోడ్లు సరిపోయింది. దీంతో ఈ పరిచాయలకే ఎక్కువ సమయం తీసుకున్నారని అనిపించింది. ఆయా సీన్స్ కుడా కొంచం లాగ్‌గా సాగుతాయి.
మూడో ఎపిసోడ్ నుంచే అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని, దేశాధినేతలను సైతం శాసించే శక్తిగల ఆ అర్మార్డ్ వస్తువును దక్కించుకోవడానికి గురు టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేయడం, వాటిని 'సిటడెల్' బృందం అడ్డుకోవడం థ్రిల్లింగ్‌గా లేకపోయినా కాస్త ఆసక్తిగానే సాగుతాయి. ఈ క్రమంలో ఓ సాధారణ యువతిగా ముంబయి వచ్చిన హనీ ఏజెంట్‌గా మారడానికి గల కారణాలు, అందుకోసం ఆమె తీసుకునే ట్రైనింగ్ ఆద్యంతం అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
బన్నీ పాత్రలో వరుణ్‌ధావన్ చాలా చక్కగా ఒదిగిపోయారు. ఇక ఈ సిరీస్‌కు ప్రాణం హనీ. ఆ పాత్రకు సామ్ పూర్తి న్యాయం చేశారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలోనూ నటించి యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టారు. ఇక ఈ సిరీస్ మొత్తం వరుణ్ ధావన్, సమంతలకు స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది. సిమ్రన్, కేకే మేనన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సిరీస్ బాగుంది.
అయితే, 'ఫ్యామిలీ మ్యాన్' స్థాయిలో ఈ సిరీస్‌లో ఎటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. సీజన్-2 కోసం స్ట్రాంగ్ పాయింట్ కూడా లేదు. హాలీవుడ్ అయితే 'సిటడెల్'కు 'హనీ బన్నీ'కి ఓ కనెక్షన్ ఉంది. హనీ బన్నీల కుమార్తె పేరు నాడియా. అమెరికన్ టీవీ సిరీస 'సిటడెల్'లో ప్రియాంక చోప్రా పేరు నాడియా. ఈ పాప పెరిగి పెద్దై ఆ నాడియాగా మారిందా? లేదా అన్నదే ఈ సిరీస్‌లో ఆసక్తికర అంశం.
బలాలు