ETV Bharat / education-and-career

మీరు కాబోయే ఇంజనీరా? - ఈ కొత్త రంగంలో కుప్పలు కుప్పలుగా ఉద్యోగాలు! - WHAT ARE THE EV COURSES

- విద్యుత్‌ వాహనాల పరిశ్రమలో రోజురోజుకీ పెరుగుతోన్న అవకాశాలు - ఈవీ కోర్సులతో మెరుగైన అవకాశాలు అందుకునేందుకు వీలు

EV Courses and Eligibility
EV Courses and Eligibility (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 10:02 AM IST

EV Courses and Eligibility: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే విద్యుత్‌ వాహనాల పరిశ్రమలో రోజురోజుకీ అవకాశాలూ పెరుగుతున్నాయి. అయితే, వాటిని అందిపుచ్చుకునేందుకు సరికొత్త ఈవీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయనే విషయాలు మాత్రం కొందరికే తెలుసు. ఆ వివరాలు తెలుసుకోవడం ద్వారా ఈ పరిశ్రమలో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. మరి ఆ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవీ వెహికల్‌ మార్కెట్‌ దాదాపు 114 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఫార్చ్యూన్‌ బిజినెస్‌ ఇన్‌సైట్స్‌ అంచనా వేస్తోంది. ప్రతి సంవత్సరమూ మార్కెట్‌లో సరాసరి 60 శాతం పెరుగుదల కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్నప్పటికీ, మనదేశంలోనూ ఈ రంగం అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉంది.

అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ రంగం గురించి నేరుగా అభ్యసించడానికి ఇప్పటివరకూ విద్యార్థులకు సరైన కోర్సులు లేవనే చెప్పాలి. ఇంజినీరింగ్, ఇతర టెక్నికల్‌ చదువుల్లో ఒక సబ్జెక్టుగానే దీన్ని చదువుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతోంది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఈవీ కోసం ప్రత్యేకంగా డిప్లొమాలను ప్రవేశపెడుతున్నాయి.

ఈవీ డిప్లొమా: ఈవీ డిప్లొమా అనేది వెహికల్‌ టెక్నాలజీలో ఒక మేలిమి మలుపుగా చెప్పవచ్చు. ఇవి విద్యార్థులను ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఇండస్ట్రీకి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయి. ఇందులో ఇంజినీరింగ్‌ అంశాలు, పరికరాల వినియోగం, డిజైన్‌ ప్రాథమిక అంశాలు సహా ఇంకా మరెన్నో నేర్చుకునే వీలు విద్యార్థులకు ఉంటుంది.

  • బిట్స్‌ పిలానీలో దీనికి సంబంధించి వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థులు ఎక్కడి నుంచైనా తరగతులు వినే వీలుంది. లైవ్‌ తరగతులను వారాంతాలు, వ్యాపార పని గంటల తర్వాత నిర్వహిస్తారు.
  • ఐఐటీ దిల్లీ సైతం దీనికి సంబంధించిన కోర్సు అందిస్తోంది. సర్టిఫైడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (హెచ్‌ఈవీఎస్‌) డిజైన్‌ రూపంలో ఈ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ దీనికి సంబంధించి అనేక అంశాలు అందుబాటులో ఉన్నాయి. కోర్సెరా, యుడెమీ, సింప్లీలెర్న్‌ వంటి వేదికల ద్వారా వీటిని నేర్చుకోవచ్చు.

ఎవరు అర్హులు: ఈ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ శాతం ఇంజినీరింగ్, డిప్లొమా, ఎమ్మెస్సీ, ఫైనల్​ ఇయర్​ ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఈ కోర్సులు కంప్లీట్​ చేయడం ద్వారా ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు జాబ్‌ మార్కెట్‌లో వస్తున్న మార్పులను గమనిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి.

ఎక్కడ?

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ: విద్యార్థుల కోసం ఒక ఏడాది వ్యవధి గల ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
  • ఇంపీరియల్‌ సొసైటీ: ఈవీ ఇంజినీరింగ్‌ సర్టిఫైడ్‌ డిప్లొమా కోర్సును అందిస్తోంది.

ఏమేం నేర్పిస్తారు?

ఈవీ డిజైన్‌: ఇంజినీరింగ్‌ కాన్సెప్ట్‌లను, టూల్స్‌ను ఉపయోగించి విద్యుత్​ వాహనాలను తయారు చేయడం నేర్చుకోవచ్చు.

బ్యాటరీ డిజైన్‌: బ్యాటరీ ప్యాక్స్‌ను రూపుదిద్దడం, సెల్‌ సార్టింగ్, థర్మల్‌ కూలింగ్‌ వంటివి.

పవర్‌ట్రైన్‌: ఈవీ పవర్‌ ట్రైన్‌ లెక్క కట్టడం, మోటార్‌ డిజైన్‌ తయారుచేయడం నేర్పిస్తారు.

భద్రత: ఈవీ క్రాష్‌ టెస్టులు, సిమ్యులేషన్స్‌ ఎలా నిర్వహించాలి, బాడీ పార్ట్స్‌ను ఎలా తయారుచేయాలనేది నేర్చుకోవచ్చు.

నిర్వహణ: విద్యుత్‌ వాహనాలను ఎలా మెయింటేన్​ చేయాలో వివరిస్తారు.

ఛార్జింగ్‌: ఛార్జింగ్‌ హబ్స్‌ను తయారు చేయడం, ఈవీలను గ్రిడ్‌లోకి ఇంటిగ్రేట్‌ చేయడం ఇందులో భాగం. పైన చెప్పిన అంశాలన్నీ ఈ కోర్సుల్లో నేర్చుకోవచ్చు.

నెలకు రూ.12 వేల స్టైఫండ్​తో బయోటెక్నాలజీ కోర్సు - ఇలా అప్లై చేసుకోండి

2030 నాటికి 78 మిలియన్ల జాబ్స్ - ఈ కోర్సులు చేస్తేనే లేకపోతే బొక్క బోర్లాపడ్డట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.