ETV Bharat / entertainment

బాలీవుడ్​లో మరో సూపర్​ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల! - ఆ హిట్​ హీరో సినిమాతో డెబ్యూ! - SREELEELA BOLLYWOOD MOVIE

బాలీవుడ్​లో శ్రీలీల ఎంట్రీ! - ఆ స్టార్​ హీరో సినిమాతో డెబ్యూ!

Sreeleela Bollywood Movie
Sreeleela (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2025, 3:19 PM IST

Sreeleela Bollywood Movie : యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్​లో దుసుకుపోతోంది. తన నటనతో, డ్యాన్స్​తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్​లోకి అడుగుపెట్టింది. అయితే త్వరలోనే తను హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి పలు రూమర్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవలె బీటౌన్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద శ్రీలీల కనిపించిందట. స్టార్ హీరో సైఫ్​ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్​తో కలిసి ఆమె అక్కడ ఉన్నట్లుగా పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. నెటిజన్లు కూడ ఈ విషయం గురించి తెగ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ ఇద్దరూ కలిసి కొత్త సినిమాలో నటించనున్నారంటూ మాట్లాడుకోసాగారు. అయితే అది కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది.

ఆ హిట్ హీరో మూవీ ఫిక్స్!

బాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేయనున్నారట. దాని కోసం శ్రీలీలను సంప్రదించగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఈ మాట విన్న శ్రీలీల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం బాలీవుడ్​లో వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నరని, ఆయన సరసన శ్రీలీల డెబ్యూ మంచి ఆలోచన అని అంటున్నారు.

Sreeleela Bollywood Movie : ఇదిలా ఉండగా, శ్రీలీల త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ నెట్టింట పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. వరుణ్​ ధావన్​తో ఆమె నటించాల్సి ఉండగా, ఆ ప్రాజెక్టును ఆమె రిజెక్ట్‌ చేసిందంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హిందీ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం తాము ఎవ్వరినీ సంప్రదించలేంటూ పేర్కొన్నారు. గతంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో బల్వీందర్ సింగ్ జంజువా తెరకెక్కిస్తోన్న 'మిట్టి' సినిమాకి శ్రీలీల సంతకం చేసినట్లు వార్తలూ వచ్చాయి.

అప్​కమింగ్ మూవీస్ :
శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో 'రాబిన్‌హుడ్', పవన్ కల్యాణ్​తో 'ఉస్తాద్ భగత్' సింగ్ వంటి సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తమిళంలో 'పరాశక్తి' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్​లో తన లుక్​ అలాగే డైలాగ్​ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.

'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్​

శ్రీలీల ఫేవరెట్ రోల్ - బాలయ్య సినిమాలో పాత్రనే! - Sreeleela Favourite Role

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.