Samantha Meditation :మూవీ ఇండస్ట్రీలో చాలా మంది కాస్తంత తీరిక దొరికినప్పుడు ఏదో ఒక ట్రిప్‌కి వెళ్తుంటారు. కొందరు ఫ్యామిలీతో ఫారిన్ టూర్‌లకి వెళ్లి సరదాగా గడిపొస్తుంటారు. ఇంకొందరు ఆధ్యాత్మికతను పెంచే, రిలాక్సేషన్ అందించే డెస్టినేషన్‌లకు వెళ్తుంటారు. తాజాగా కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన సామ్, అక్కడ మెడిటేషన్ చేస్తూ కనిపించింది. ధ్యానంలో లైనమైపోతూ రిలాక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసి ఓ చక్కటి క్యాప్షన్‌ను జోడిచింది.
"గురువు, మెంటార్ కోసం మనలోని చాలామంది వెతుకుతుంటారు. కానీ మన జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనిపెట్టడానికి మించిన ప్రత్యేకమైన విషయం మరొకటి ఉండదు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక ఘటనలు మనపై ప్రభావితం చూపుతుంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏవి అసాధారణమో తెలుసుకోవడం మనకు చాలా కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలుచేయడం కూడా ముఖ్యమే" అంటూ సమంత తెలిపింది.
సమంత నెక్స్ట్ మూవీ ఏదంటే?
సమంత ఇటీవల శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన 'ఖుషి' మూవీలో కనిపించింది. ఇందులో హీరోగా విజయ్ దేవర కొండ నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఓటీటీలో ఫర్వాలేదనిపించింది.