Sankranti Ki Vastunnam : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ 'సంక్రాతికి వస్తున్నాం' సినిమాతో మరోకొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. 2025 సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమైన ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.
- ఇది విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా కావడం విశేషం. ఇదివరకు ఈ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు కూడా మంచి విజయం దక్కించుకున్నాయి. అయితే ఆ సినిమాలు కంప్లీట్ కుటుంబ కథా చిత్రాలు కాగా, ఈ సినిమాలో కాస్త యాక్షన్ జోడించారు
- దాదాపు 18ఏళ్ల తర్వాత 'గోదారి గట్టుమీద' అంటూ సింగర్ రమణ గోగుల తన స్వరం వినిపించారు. ఆయన వాయిస్‌తో ఈ పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. రిలీజైనప్పటి నుంచి ఈ పాట దుమ్మురేపుతోంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది
- ఈ సినిమాలో వెంకటేశ్ నటించడమే కాకుండా, ఓ పాట కూడా పాడారు. 'బ్లాక్ బస్టర్ పొంగల్' అనే పాట వెంకీనే ఆలపించారు.
- డైరెక్టర్ అనిల్ రావిపూడి సాధారణంగా స్ర్కిప్ట్ పూర్తయ్యాక, సీన్స్ ఎడిట్ చేస్తారు. కానీ, ఈ సినిమాకు కాస్త భిన్నంగా స్ర్కిప్ట్ దశలోనే సన్నివేశాలు ఎడిట్ చేశారు
- ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆగస్టులో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లోనే ముగిసింది.
- ఫైనల్ కటింగ్‌తో సినిమా రన్‌టైమ్ 2 గంటలా 26 నిమిషాలు రాగా, సెన్సార్‌కు మాత్రం 2 గంటలా 22 నిమిషాలే పంపినట్లు తెలిసింది
కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వి రాజ్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు.
'థియేటర్లకు రండి - నవ్వించి పంపిస్తాం' - వెంకీకి మరో విక్టరీ గ్యారెంటీ!
వెంకీమామ టెన్షన్ ఫ్రీ లైఫ్ - 4 జీవిత సూత్రాలతో ఫుల్ బిందాస్!