Daaku Maharaaj Day 1 Collections : 'డాకు మహారాజ్'తో సంక్రాంతి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ మంచి విజయ సొంతం చేసుకున్నారు. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఫస్ట్ డే థియేటర్లు దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. దీంతో డాకు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ సాధించింది.
ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 56 కోట్లు (గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, బాలయ్య కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది. ఈమేరకు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'డాకు మహారాజ్ మంచి రెస్పాన్స్‌తో ఈ సంక్రాంతికి క్లీన్ హిట్ సొంతం చేసుకుంది. వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు రూ.56+ కోట్లు వసూల్ చేసింది' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
#DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥
— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025
𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨
That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a
ఓవర్సీస్లోనూ హవా
ఓవర్సీస్లోనూ బాలయ్య మేనియా నడుస్తోంది. ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన నాటినుంచి బుకింగ్స్‌లో డాకు సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే USAలో తొలిరోజే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
రెండ్రోజుల్లో ఆ మైలురాయి
సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న డాకు రెండో రోజూ డీసెంట్ ఆక్యూపెన్సీతో రన్ అవుతోంది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లోనే డాకు రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక లాంగ్ రన్లో ఈజీగా రూ.200 కోట్ల మార్క్ దాటుతుందని అంటున్నారు.
కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి ఆడిపాడారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ రీసెంట్గా చెప్పారు.
'డాకు' సక్సెస్ సెలబ్రేషన్స్- ఊర్వశీతో బాలయ్య క్రేజీ డ్యాన్స్!
బ్లాక్‌బస్టర్ 'డాకు మహారాజ్'- OTTలో బాలయ్య మాస్ జాతర ఎప్పుడంటే?