ETV Bharat / state

అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ వచ్చేసింది - ధర తక్కువే - ఆన్​లైన్​లో ఇప్పుడే బుక్​ చేసేయండి - AKKA MAHADEVI CAVES STAY PACKAGE

అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ ప్రారంభించిన ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ - రెండు రోజుల పర్యటన - ఆన్‌లైన్‌లో బుకింగ్

Akka Mahadevi Caves Stay Package
Akka Mahadevi Caves Stay Package (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 9:57 AM IST

Akka Mahadevi Caves Stay Package : ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. దోమలపెంట అక్కమహాదేవి స్టే ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆన్‌లైన్‌లో బుకింగ్ : నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న అక్కమహాదేవి గుహలు దోమలపెంట స్టే ప్యాకేజీని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ప్రారంభించారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుహల సందర్శన పర్యాటకులకు మధురానుభూతిని మిగల్చుతుంది. 2 రోజులు సాగే ప్యాకేజీ కోసం పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మొదటి రోజు ఇలా : దోమలపెంట అక్కమహాదేవి పర్యటనలో మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు దోమలపెంట అటవీ శాఖ ఆఫీస్ వద్ద ఉన్న వనమయూరి అతిథి గృహంలోని బుక్‌ చేసుకున్న రూమ్​కి చేరుకోవాలి. అనంతరం పర్యాటకులను దోమలపెంట దగ్గరలోని వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూపాయింట్​లకు వాహనాల్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత నైట్ భోజనం తీసుకుని విశ్రమిస్తారు.

రెండో రోజు ఇలా : మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకు పర్యాటకులను అక్కమహాదేవి గుహలకు వెళ్లే మార్గానికి వాహనాల్లో తీసుకువెళ్తారు. శ్రీశైలం ప్రధాన రోడ్ నుంచి దాదాపు 5 కిలో మీటర్ల దూరంలోని అక్కమహాదేవి గుహలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ మార్గంలో కనిపించే పక్షులు, జంతువులు, వివిధ రకాల వృక్షాల గురించి గైడ్‌లు పూర్తిగా వివరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అతిథి గృహానికి చేరుకోవటంతో ఈ పర్యటన ముగుస్తుంది.

వసతి సౌకర్యాలు : పర్యటన ప్యాకేజీలో భాగంగా పర్యాటకులకు ఉదయం అల్పాహారం, రాత్రి బస, భోజనం, ఆక్టోపస్‌ దృశ్యకేంద్రం, వజ్రాల మడుగు, అక్కమహాదేవి గుహల గేటు వద్దకు వాహనం సౌకర్యం కల్పిస్తారు. పర్యాటకులు ఎంపిక చేసుకునే రూమ్​ రకాన్ని బట్టి రూ.6,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తారు. రూమ్​కి ఇద్దరిని చొప్పున అనుమతిస్తారు. ఇంకో వ్యక్తిని అనుమతించాలంటే అదనంగా రూ.1,700 చెల్లించాలి.

నల్లమల సిగలోని ప్రకృతి అందాలను చూసొద్దాం రండి!

ఇకపై రోడ్డు మార్గంలోనే అక్కమహాదేవి గుహకు - ఈ సెలవుల్లో ప్లాన్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.