Salman Khans House Firing Case :ముంబయిలోనిబాంద్రాలోని హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల విషయంలో తాజాగా విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. కాల్పుల తర్వాత ముంబయి నుంచి పారిపోయిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్థరాత్రి పట్టుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం వారిని ముంబయికి తరలించనున్నారు.
మరోవైపు ఇదే కేసు విషయంలో ముగ్గురిని విచారించారు పోలీసులు. వీరిలో నిందితుల ఇంటి ఓనర్, వాళ్లు ఉపయోగించిన టూ వీలర్ పాత ఓనర్, ఆ బైక్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్ ఉన్నారు. అయితే విచారణలో అనూహ్యమైన నిజాలు బయటకొచ్చాయి. న్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇక కాల్పుల సమయంలో సల్మాన్‌ఖాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
"మౌంట్ మేరీ చర్చి దగ్గర బైక్‌ను వదిలిన నిండితులు కొంతదూరం పాటు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ ఆటోలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి బొరివలి వైపు వెళ్లే రైలును ఎక్కారు. కానీ, శాంతాక్రజ్ రైల్వేస్టేషన్‌లో దిగి బయటకు వెళ్లిపోయారు" అంటూ ఓ అధికారి తెలిపారు.